సదాశివనగర్, వెలుగు: సొసైటీల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని మండల ప్రత్యేక అధికారి, జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్ అన్నారు. బుధవారం సదాశివనగర్ సొసైటీ పరిధిలోని ధర్మారావుపేట్, తిర్మన్‌పల్లి, సదాశివనగర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ కమలాకర్‌రావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేడ్‘ ఏ’ రకం ధాన్యానికి మద్దతు ధర రూ.2320, సాధారణ రకానికి రూ. 2300 ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఈవో విఘ్నేష్గౌడ్, ఎంపీడీవో సంతోశ్ కుమార్, తహసీల్దార్ గంగాసాగర్, ఏఈవో కవిత, బద్దం శ్రీనివాస్‌రెడ్డి, గాదారి శ్రీనివాస్ రెడ్డి, వడ్ల రాజేందర్, మధుసూదన్‌రెడ్డి, జనగామ రాజు, కోతి లింగారెడ్డి, కొప్పుల నర్సారెడ్డి, బాబాయ్య, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోడెగామ, పద్మాజివాడి, మల్లుపేట్లో..
సదాశివనగర్ మండలం పద్మాజివాడి సొసైటీ పరిధిలోని పద్మాజివాడి, మోడెగామ, మల్లుపేట్ గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్గంగాధర్ ప్రారభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కుంట శ్రీనివాస్ రెడ్డి, సీఈవో దేవేందర్‌రావు, ఏఈవో గాయత్రి, భరత్‌రెడ్డి, డైరెక్టర్లు, రైతులు తదితరులు
పాల్గొన్నారు.
బైరాపూర్‌లో సోసైటీ ఆధ్వర్యంలో..
బీర్కూర్, వెలుగు: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ర్ట ఆగ్రో ఇండస్ర్టీస్ చైర్మన్కాసుల బాల్రాజ్అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్మండలం బైరాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కాసుల బాల్రాజ్మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు.
ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి అందించే బోనస్ పొందాలని, దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. బీర్కూర్ సొసైటీ ఆధ్వర్యంలో చించెల్లి, కిష్టాపూర్, నస్రుల్లాబాద్ మండలం మైలారం సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా సొసైటీ చైర్మన్లు గాంధీ, హనుమంత రావుల ఆధ్వర్యంలో ప్రారంభించారు.