యూట్యూబర్​: కెల్లీ..సోలో ట్రావెలర్​

పని మీద పక్క రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తేనే ఎన్నో ఆలోచిస్తాం. అక్కడ ఎక్కడ ఉండాలి? ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలా ఉంటుంది? ఏం తినాలి? అంటూ ఎన్నో లెక్కలేసుకోవడం సహజం. అదే ఒక ఆడపిల్ల ఒంటరిగా ప్రయాణం చేయాలంటే ఇంకెంత ఆలోచించాలి. కానీ.. కెల్లీ మాత్రం ఏ భయం లేకుండా రాష్ట్రాలు కాదు.. ఏకంగా దేశాలు దాటి వెళ్తోంది. సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొరియా నుంచి వచ్చి ఆసియా దేశాలను ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. 

దక్షిణ కొరియాలో పుట్టి పెరిగింది కెల్లీ(అసలు పేరు లీ చే ఎన్​). అప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఆమెకు చిన్నప్పటినుంచి ప్రపంచాన్ని చుట్టేయాలనేది కోరిక. అందుకే 22 ఏండ్ల వయసులోనే దేశం విడిచి ప్రపంచ యాత్ర మొదలుపెట్టింది. అందులో భాగంగా ముందుగా ఆసియా ఖండంలోని దేశాలను ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం మొదలుపెట్టింది. ఆమె ప్రయాణంలో.. తీపి జ్ఞాపకాలతోపాటు చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. 

యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి...

కెల్లీ 2016లో యూట్యూబ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. తన పేరుతోనే యూట్యూబ్​ ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టింది. కానీ.. వెంటనే వీడియోలు చేయలేదు. 2023 జూన్​ 13న తన మొదటి వీడియో పోస్ట్​ చేసింది. తన వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూర్​లో భాగంగా మొదటగా ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లింది. అక్కడి నుంచే మొదటి వీడియో అప్​లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ఆ వీడియోకు పెద్దగా వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాలేదు. అక్కడే చాలా వీడియోలు చేసినా లాభం లేకుండా పోయింది. వాటిలో కొన్ని వీడియోలకు ఇప్పటికీ పాతిక వేల వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా దాటలేదు. అయినా.. పట్టువదలకుండా యూట్యూబ్​లో వీడియోలు అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. అక్కడినుంచి వియత్నాం తర్వాత మలేసియా వెళ్లింది.

అక్కడ కూడా అదే పరిస్థితి వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అంతగా లేవు. అక్కడి నుంచి ఇండియాకి వచ్చింది. ఇక్కడికి వచ్చాక పెట్టిన రెండో వీడియోకే 1.8 మిలియన్ల వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. ఛానెల్​కు సబ్​స్క్రయిబర్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ‘‘కెల్లీ”ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 1.04 మిలియన్ల సబ్​స్క్రయిబర్స్ ఉన్నారు. ఇన్​స్టాగ్రామ్​లో కూడా ఫాలోవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాగానే పెరిగారు. ఇప్పటివరకు ఛానెల్​లో 340కి పైగా వీడియోలు అప్​లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ఇండియాలో చేసిన ఒక షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియోకు ఏకంగా 53 మిలియన్ల వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. ఇక మిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యూస్​ దాటిన షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియోలు ఆమె ఛానెల్​లో చాలానే ఉన్నాయి. పెద్ద వీడియోల్లో కూడా మిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాటినవి ఎక్కువగానే ఉన్నాయి. ఆ వీడియోల్లో ఎక్కువ ఇండియాలో చేసినవే. 

ఒంటరిగా.. 

కెల్లీ ఎక్కడికి వెళ్లినా ఒంటరిగానే వెళ్తుంది. అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుంది. వెళ్లిన ప్రతి దగ్గరా అక్కడివాళ్లను అడిగి కల్చర్, ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుంటుంది. అంతేకాదు.. ట్రెడిషనల్​ డ్రెస్సింగ్​, ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి ట్రై చేస్తుంటుంది. ఇరుకు దారుల్లో తిరుగుతూ వ్లాగ్స్ చేస్తుంటుంది. స్ట్రీట్​ ఫుడ్ తింటూ రివ్యూలు ఇస్తుంటుంది. ఏడు నెలల క్రితం ఆమె ‘‘కెల్లీ రివ్యూ” పేరుతో మరో ఛానెల్​  మొదలుపెట్టింది. అందులో  ఫుడ్ రివ్యూలు చేస్తోంది. కాకపోతే.. ఆ ఛానెల్​కు రీచ్ అంతగా​ రాలేదు. ప్రస్తుతం11 వేల సబ్​స్క్రయిబర్స్ మాత్రమే ఉన్నారు. 

చేదు అనుభవం

ఇండియాలో ఉన్నప్పుడే తన ఛానెల్​కు ఎక్కువ సబ్​స్క్రయిబర్స్ వచ్చారు. కానీ.. ఆమెకు ఒక చేదు అనుభవం ఎదురైంది. పూణె శివార్లలోని ఒక మార్కెట్​లో వీడియో తీస్తూ..  స్థానికులతో మాట్లాడుతోంది. అక్కడి వాళ్లతో ‘నమస్తే’ అంటూ మన స్టయిల్​లో పలకరిస్తుండగా అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి వచ్చి ఆమె భుజం మీద చేయి వేశాడు. అయినా.. ఆమె రియాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకుండా నవ్వుతూనే మాట్లాడింది. తర్వాత అతను కాస్త దూరంగా వెళ్లాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మరో వ్యక్తి  “అంత దూరం నిలబడకు” అనగానే మళ్లీ ఆమె దగ్గరకు వెళ్లి మెడ మీద చేయి వేసి ఇబ్బంది పెట్టాడు. అక్కడి నుంచి నవ్వుతూనే తప్పించుకున్నా.. తర్వాత భయపడింది. ‘‘నేను ఇక్కడి నుండి పారిపోవాలి...

అతను కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు” అంటూ తన పరిస్థితిని వ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెప్పి అక్కడినుంచి వెంటనే వెళ్లిపోయింది. ఈ సంఘటన పూణె సిటీ శివార్లలోని రావేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగింది. కెల్లీ అప్​లోడ్​ చేసిన ఆ వీడియోను నెటిజన్లు పోలీసులకు పంపారు. యాక్షన్ తీసుకోవాలని కోరారు. దాంతో.. అక్కడి పోలీస్ కమిషనర్ వినోయ్ కుమార్ చౌబే కేసు నమోదు చేసి, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు ఫైల్​ చేశారు. 

ఈ మధ్యే ఇండోనేసియాను చుట్టేసిన కెల్లీ ప్రస్తుతం వీసా గడువు ముగియడంతో తిరిగి స్వదేశానికి చేరుకుంది. అక్కడ కూడా ఖాళీగా ఉండకుండా తన హోం టూర్​ వీడియో చేసి అప్​లోడ్ చేసింది. ‘‘వీసా దొరకగానే మళ్లీ ఇండోనేసియాకే వెళ్తా. మరికొన్ని ప్రాంతాలు ఎక్స్​ప్లోర్​ చేస్తా” అంటోంది సోలో ట్రావెలర్​ కెల్లీ.