సంక్రాంతి షాపింగ్ : మనసు దోచే చార్మినార్ ముత్యాలు.. ఒరిజినల్, నకిలీ ముత్యాలను గుర్తించటం ఇలా..!

మగువల మనసు దోచే ఆభరణాల్లో ముత్యాలు ముందుంటాయి, ఆడపిల్ల మెడలో బంగారం ఉన్నా, లేకున్నా ముత్యాల దండ మాత్రం కనిపిస్తుంది. అందుకే చాలామంది ముత్యాలు వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ముత్యాలకు ఫేమస్ హైదరాబాద్ పాతబస్తీ, మంచి ముత్యాలు ఎక్కడ తయారవుతాయి? నకిలీ, అసలు ముత్యాలను గుర్తించడం ఎలా..?

 సిటీ ఆఫ్ పెరల్స్: 

భాగ్యనగరానికి మరో పేరు సిటీ ఆఫ్ పెరల్స్. చార్మినార్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా ముత్యాల దుకాణాలే కనిపిస్తుంటాయి. ఇక్కడి ముత్యాల కోసం విదేశీయులు కూడా వస్తారంటే, ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. చార్మినార్ చూసేందుకు వచ్చేవాళ్లు కూడా ముత్యాలపై మనసు పారేసుకుంటారు. పాతబస్తీలో రెండు రకాల ముత్యాలు దొరుకుతాయి ఒకటి నేచురల్ ఫ్రెష్ వాటర్ ముత్యాలు, మరొకటి కల్చర్డ్ ముత్యాలు. నేచురల్ ఫ్రెష్ వాటర్ ముత్యాలు ఆస్ట్రియా, వెనెజులా నుంచి, కల్చర్డ్ జపాన్, చైనా నుంచి తెప్పిస్తుంటారు.

వ్యాపారులు వివిధ ఆకృతుల్లో షేపుల్లో మలిచి, చైన్లలా అమ్ముతుంటారు. "చాలామందికి ముత్యాలపై అవగాహన ఉండదు. నకిలీవి కొని మోసపోతుంటారు. ఒరిజినల్ ముత్యాలు వైట్, గ్రే, లైట్ పింక్ కలర్స్ ఉంటాయి. వీటిని రంగునీళ్లలో వేసి రెండు మూడేళ్లపాటు ఉంచుతాం. ఆ రంగు నీళ్లు ముత్యాలకు పట్టిన తర్వాతే తీసి అమ్ముతాం. ఒరిజినల్ ముత్యాలను కొనడానికే చాలామంది ఇష్టం చూపుతారని చెప్పారు వ్యాపారులు. 

రకరకాల డిజైన్లలో 

ముత్యాలు రకరకాల డిజైన్లలో మార్కెట్లో దొరుకుతున్నాయి. దండలా పేర్చి కూడా. అమ్ముతుంటారు. సాధారణ డిజైనడు మనసు దోచే ముత్యాలు విదేశీయులు బాగా ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం జిగ్ జాగ్ వైన్స్, సింగిల్ బాటమ్, సైడ్ లాకెట్, శ్రీ లేయర్, ఫోర్ లేయర్, రూబీ ఎంబ్రాయిడరీ, సింగిల్ లైన్, ఓవెల్ డిజైన్ ఏ పీస్ డబుల్ లేయర్ డిజైన్, వైర్ డిజైన్, అచ్ఛిపల డిజైన్లు అకట్టుకున్నాయి. ఒరిజినల్ పెరల్స్ ధరలు వెయ్యి రూపాయల నుంచి ముప్పై వేల వరకు.. కల్చర్డ్ ముత్యాలు అయితే, వంద నుంచి వెయ్యి రూపాయల్లో దొరుకుతున్నాయి. 

Also Read :- పట్నం పండుగ నుమాయిష్

నాణ్యమైనవి 

నాణ్యమైన ముత్యాలకు కేరావ్ హైదరాబాద్. ఇక్కడి బిర్యానీ ఎంత ఫేమస్సో.. ముత్యాలు కూడా అంతే ఫేమస్ సవాబుల కాలం నుంచి వీటికి డిమాండ్ ఉంది చైనా, జపాన్, పాంకాంగ్ దేశాల్లో తయారవుతాయి. కానీ నాణ్యమైనవి మాత్రం ఇక్కడే దొరుకుతాయి. అందుకే మనదేశస్తులే కాకుండా విదేశీయులు కూడా ఇక్కడి ముత్యాలపై ఇష్టం రూపు తున్నారు. 

గుర్తుపట్టడం ఎలా..?

ఒరిజినల్, నకిలీ ముత్యాలను ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఒరిజనల్ ముత్యాలకు ఒక షేప్ అంటూ ఉండదు. ఒక్కో ముత్యం ఒక్కో డిజైన్లో ఉంటుంది. పట్టుకుంటే గట్టిగా ఉంటాయి. వీటిని బాగా రుద్దితే రుద్దితే పొడి వస్తుంది. నకిలీ అయితే, ఒకే సైజులో ఉంటుంది.. మెత్తగా అనిపిస్తాయి. ఇవి ప్లాస్టిక్ లేయర్ తో తయారవుతాయి. 

రాయల్ లుక్ 

పార్టీలు, ఫంక్షన్లకే కాకుండా పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాలకు కూడా ముత్యాలు వేసుకోవచ్చు. వీటితో రాయల్ లుక్ వస్తుంది. మహిళల అందాన్ని మరింత పెంచుతాయి మత్యాలు ట్రెండ్ కు తగ్గట్లుగా మార్కెట్లో దొరుకుతున్నాయి. గోల్డ్ తో తయారు చేసినవి కూడా ఉన్నాయి. డ్రెస్సుకు మ్యాచింగ్ ముత్యాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది.

== వెలుగు లైఫ్