యూట్యూబర్ ​: గేమర్‌‌‌‌‌‌‌‌ కావాలనే..

ఒకప్పుడు పిల్లల్ని ‘నువ్వు ఏం కావాలి అనుకుంటున్నావ్‌‌‌‌?’ అని అడిగితే.. డాక్టర్​, ఇంజనీర్​ అని చెప్పేవాళ్లు. కానీ.. ఇప్పటి పిల్లలు గేమర్, ఇన్‌‌‌‌ఫ్లుయెన్సర్ అని చెప్తున్నారు. జనాల మీద సోషల్ మీడియా ఇంపాక్ట్‌‌‌‌ అంతలా ఉంది. అంతేకాదు.. ఆ రంగంలో కాంపిటీషన్‌‌‌‌ కూడా అంతే ఉంది. అయినా.. గేమింగ్ మీద ఇంట్రెస్ట్‌‌‌‌తో యూట్యూబ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ.. కోటిమంది ప్రేమను గెలుచుకున్నాడు ఆదిత్య సావంత్‌‌‌‌.

ఆదిత్య సావంత్‌‌‌‌ 1996లో ముంబయిలో పుట్టాడు. తండ్రి దీపక్, తల్లి వైశాలి. చెల్లి ఆరాధ్య ఫ్యాషన్ మోడల్. ఆదిత్య చదువు ముంబయిలోనే పూర్తయింది. బిజినెస్ మేనేజ్‌‌‌‌మెంట్​లో గ్రాడ్యుయేషన్ చేశాడు. అయితే.. ఆదిత్యకు చిన్నప్పటి నుండి కంప్యూటర్ గేమ్‌‌‌‌లంటే చాలా ఇష్టం. తన తల్లి ఇచ్చిన పాకెట్​మనీతో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా గేమింగ్ పార్లర్‌‌‌‌కు వెళ్లి గేమ్స్ ఆడేవాడు. ‘ఆదిత్య ఎక్కువగా గేమ్స్‌‌‌‌ కోసమే ఖర్చు చేసేవాడు’ అని ఇప్పటికీ అతని ఫ్రెండ్స్ చెప్తుంటారు. గేమింగ్‌‌‌‌ మీద ఇష్టంతోనే తండ్రి ఇచ్చిన డబ్బుని కూడబెట్టుకుని చివరకు ఒక కంప్యూటర్ కూడా కొన్నాడు.

యూట్యూబ్‌‌‌‌లోకి.. 

గేమింగ్‌‌‌‌మీద విపరీతమైన ఇష్టం ఉంది. కానీ.. గేమ్స్ ఆడడం వల్ల డబ్బులు రావు కదా! అందుకే తనకు ఉన్న గేమింగ్‌‌‌‌టాలెంట్‌‌‌‌తోనే ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. అందుకే 2010లోనే అంటే అతనికి పద్నాలుగేండ్ల వయసు లోనే ‘డైనమో గేమింగ్’ పేరుతో ఒక యూట్యూబ్‌‌‌‌ ఛానెల్ క్రియేట్ చేశాడు. అందులో తను గేమ్స్ ఆడిన వీడియోలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయాలి అనుకున్నాడు. కానీ.. కొన్ని కారణాల వల్ల అంతగా వీడియోలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయలేదు. ఛానెల్‌‌‌‌కు ఆ పేరు పెట్టడానికి కారణం.. అతను చిన్నప్పటినుంచి మెజీషియన్‌‌‌‌ డైనమో చేసే మ్యాజిక్‌‌‌‌లు చూసేవాడు.

అతనికి డైనమో అంటే చాలా ఇష్టం. అందుకే ఆ పేరు పెట్టాడు. ఛానెల్‌‌‌‌ పెట్టిన కొన్నాళ్లకు వీడియోలు పోస్ట్‌‌‌‌ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో ‘బ్యాటిల్‌‌‌‌ఫీల్డ్ ఆటో, జీటీఏ’ లాంటి గేమ్స్‌‌‌‌ ఆడేవాడు. ఆ గేమ్స్‌‌‌‌ని రికార్డ్ చేసి ఆ వీడియోలను ఛానెల్‌‌‌‌లో పెట్టేవాడు. కానీ.. వాటికి పెద్దగా వ్యూస్ వచ్చేవి కాదు. అయినా వెనక్కి తగ్గకుండా వీడియోలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశాడు. అప్పట్లో సోషల్‌‌‌‌ మీడియాకు క్రేజ్ లేకపోయినా భవిష్యత్తు మీద నమ్మకంతో వీడియోలు చేసి, చివరికి సక్సెస్‌‌‌‌ అయ్యాడు.

పబ్జీతో.. 

బ్యాటిల్‌‌‌‌ఫీల్డ్స్‌‌‌‌, జీటీఏ, అపెక్స్‌‌‌‌ లాంటి గేమ్స్‌‌‌‌ ఆడుతున్నప్పుడు వంద మంది సబ్‌‌‌‌స్క్రయిబర్ల అయ్యేందుకు దాదాపు ఐదేండ్లు పట్టింది. కానీ.. కొన్నాళ్లకు ఆదిత్య తన ఛానెల్‌‌‌‌లో పబ్జీ సిరీస్‌‌‌‌ మొదలుపెట్టాడు. అప్పటినుంచి ఛానెల్‌‌‌‌కు వ్యూయర్‌‌‌‌‌‌‌‌షిప్ బాగా పెరిగింది. అలాగే సబ్‌‌‌‌స్క్రయిబర్ల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పుడు ఆదిత్య చేసే వీడియోల కోసం రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా కొన్ని లక్షల మంది ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం డైనమో గేమింగ్ ఛానెల్‌‌‌‌కు 9.98 మిలియన్ల సబ్‌‌‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. చాలా వీడియోలకు మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఈ ఛానెల్‌‌‌‌తోపాటు ఆదిత్య మరో రెండు ఛానెల్స్ కూడా నడుపుతున్నాడు. వాటిలో ‘డైనో వ్లాగ్స్’ ఛానెల్‌‌‌‌కు 5.48 లక్షల మంది సబ్‌‌‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇందులో రెగ్యుల్‌‌‌‌గా వ్లాగ్స్ అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తున్నాడు. ‘డైనో షార్ట్స్‌‌‌‌’ ఛానెల్‌‌‌‌ను 24.7 లక్షల మంది సబ్‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌ చేసుకున్నారు. ఇందులో షార్ట్ వీడియోలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తున్నాడు. 

స్టయిలే వేరు

మిగతా గేమర్స్‌‌‌‌తో పోలిస్తే.. ఆదిత్య సావంత్ గేమ్స్ ఆడే పద్ధతి డిఫరెంట్‌‌‌‌గా ఉంటుంది. అందుకే ప్రపంచంలోని అతిపెద్ద పబ్జీ లైవ్ మొబైల్ ప్లేయర్లలో ఒకరిగా ఎదిగాడు. డైనమో గేమ్‌‌‌‌ప్లే అద్భుతంగా ఉండడం వల్లే అతనికి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. లైవ్ స్ట్రీమ్‌‌‌‌లో అతను చెప్పే డైలాగ్‌‌‌‌ల వల్ల చాలా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సక్సెస్‌‌‌‌ వచ్చిన కొత్తలో తన అభిమానుల ప్రేమనే కాదు.. కోపాన్ని కూడా చూడాల్సి వచ్చింది.

సక్సెస్​ వచ్చిన మొదట్లో కొన్నిసార్లు చాలా గర్వంగా మాట్లాడాడు. కానీ..ఆ  తర్వాత రియలైజ్‌‌‌‌అయ్యాడు. ‘‘మా నాన్న నాకు రియాలిటీ తెలిసేలా చేశాడు. సక్సెస్​ వల్ల గర్వం తలకెక్కకూడదు’’ అని చెప్పాడు. దాంతో ‘‘సక్సెస్‌‌‌‌ రావడం వల్ల నాక్కొంచెం గర్వం పెరిగింది.  అందుకే అలా మాట్లాడా. నన్ను క్షమించండి” అని వ్యూయర్స్​ని అడిగాడు. 

ఆదాయం బోలెడు మార్గాల్లో...

ఆదిత్యకు చాలా రకాలుగా ఆదాయం వస్తోంది. ‘హైడ్రా’ అనే సంస్థను పెట్టాడు. ఇది మల్టీపుల్‌‌‌‌ ఇ–స్పోర్ట్స్ టోర్నమెంట్స్‌‌‌‌ నడిపే సంస్థ. దీన్నుంచే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్‌‌‌‌, యూట్యూబ్‌‌‌‌ శాలరీ ద్వారా కూడా ఆదాయం వస్తోంది. ఇప్పటివరకు ఆదిత్య 24 కోట్ల రూపాయలకు పైగానే సంపాదించాడనేది ఒక అంచనా. బ్రాండ్ ఎండార్స్‌‌‌‌మెంట్స్‌‌‌‌ నుండి కూడా బాగానే ఆదాయం వస్తోంది.