యూట్యూబ్‍లో AI వాయిస్ క్లోన్, డీప్ ఫేక్‌లను గుర్తించే కొత్త టూల్స్

ప్రపంచవ్యాప్తంగా వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం యూట్యూబ్ కు చాలామంది యూజర్లు ఉన్నారు. వివిధ రకాల కంటెంట్ క్రియేట్ చేసి యూజర్లకు అందించడానికి యూట్యూబ్ బాగా ఫేమస్ అయ్యింది. తాజాగా యూట్యాబ్ లో ఏఐతో జరిగే మోసాలను గుర్తించడానికి యూట్యూబ్ లో కొత్త టూల్స్  తీసుకువస్తు్న్నట్లు ప్రకటించింది. కంటెంట్ క్రియేటర్లు వారి గొంతును అనుకరించే AI- రూపొందించిన వాయిస్ లను గుర్తించడానికి ఉపయోగపడే టెక్నాలజీ పై యూట్యూబ్ టీం పని చేస్తోంది. సింథటిక్ సింగింగ్ ID వాడి నకిలీ వాయిస్ ను గుర్తిస్తోంది ఈ ఫీచర్. వాయిస్ తోపాటు డీప్ ఫేక్ వీడియోలు కూడా ఈ టెక్నాలజీ ముందుగానే గుర్తించి కిల్ చేస్తోంది.

ఈ ఫీచర్ పైలట్ ప్రొగ్రామ్ గా 2024లో తీసుకురావాలని యూట్యూబ్ ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఆ కంపెనీ పార్ట్నర్స్ తో కలిస్ ఆ ఫీచర్స్ డెవలప్ చేస్తోంది. ఫేక్ వాయిస్ లతో క్రియేట్ చేసే వీడియోలను ఈ అప్ డేట్ ముందుగానే గుర్తించి ఈ వీడియో అప్లోడ్ కాకుండా చేస్తుంది. టెక్నాలజీ మిస్ యూస్ కాకుండా, కాపీ రైట్ కంటెంట్ అప్ లోడ్ కాకుండా ఈ ఏఐ ఫీచర్ల ఉపయోగపడుతాయని టెక్ నిపుణులు చెప్తున్నారు.