షాకింగ్ : యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలు పెంపు

ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచింది. ప్రతి సంవత్సరం యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచడం లేదా తగ్గించడం చేస్తోంది. అయితే ఈసారి యూట్యూబ్ లో యాడ్ ఫ్రీ కంటెంట్ కావాలనుకునే వారికి ధరల మోత మోగుతుంది. ఇటీవల టారిఫ్ చార్జీలు కూడా పెరిగాయి.. ఇప్పుడు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్రీమయం ప్లాన్స్ దీంతో యూజర్లపై అధక భారం పడనుంది. YouTube ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం కొత్త ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ YouTube మ్యూజిక్ యాక్సెస్‌ అన్‌లాక్ అవుతుంది. యూట్యూబ్ సపోర్ట్స్ కు వెళ్లి ప్రస్తుతం ఉన్న యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ఛార్జీలు చూడవచ్చు. 

పెరిగిన YouTube ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు :

  • ఇండివిస్వల్ మంథ్లీ ప్యా్క్ రూ.129 నుంచి రూ.149 కు పెంచారు.

  • స్టూడెంట్ మంథ్లీ సబ్స్క్రిప్షన్ పై రూ.10 పెంచుతూ.. రూ.89 రీఛార్జ్ చేసింది.

  • అలాగే ఫ్యామిలీ నెలవారీ రీఛార్ పై గతంలో రూ.189 ఉండగా..రూ.299 చేసింది

  • ఇండివిస్వల్ ప్రీపెయిడ్ (మంథ్లీ ) ప్లాన్ పై రూ20పెంచి.. రూ.159గా చేసింది.

  • ఇండివిస్వల్ ప్రీపెయిడ్ (క్వాటర్లీ) ప్రీమియం ప్లాన్ పై రూ.60 పెంచి రూ.459 లు చేసింది.

  • ఇండివిస్వల్ ప్రీపెయిడ్ (యానివల్) ఈ ప్లాన్ పై రూ.200 పెంచి రూ.1490లు రీచార్జ్ ధర పెట్టింది.