Youtube: యూట్యూబ్పై యూజర్లు గరంగరం.. ఇదే కారణం.. మీరూ ఫేస్ చేశారా..?

భారత్లో యూట్యూబ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఇబ్బంది ఎదుర్కొన్న కొందరు యూట్యూబ్ యూజర్లు ‘ఎక్స్’లో ఈ విషయాన్ని వెల్లడించారు. యూట్యూబ్ సేవలకు అంతరాయం ఏర్పడటంపై పోస్టులతో ఇవాళ ఉదయం నుంచి ట్విటర్ హోరెత్తింది. యూట్యూబ్పై అసహనాన్ని యూజర్లు సోషల్ మీడియాలో వెళ్లగక్కారు. యూట్యూ్బ్ నుంచి స్పందనను డిమాండ్ చేశారు. #YouTubeDown హ్యాష్ ట్యాగ్ ‘X’లో ట్రెండ్ అయింది. సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అంటే.. ఈ పోస్టులపై యూట్యూబ్ అధికారికంగా స్పందించింది. ‘‘ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు.. పరిశీలించి, పరిష్కారానికి కృషి చేస్తాం.. ఇతర సమాచారానికి అవసరమైతే తిరిగి సంప్రదిస్తాం’’ అని యూట్యూబ్ సమాధానం ఇచ్చింది. 

Also Read:-డిగ్రీ చదివిన ప్రతి ఇద్దరిలో ఒకరు ఉద్యోగానికి పనికి రారు

యూట్యూబ్ సేవలకు అంతరాయం ఏర్పడటానికి రకరకాల కారణాలు ఉండొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి అంతరాయానికి సాధారణంగా నెట్ వర్క్ సమస్యలు, మెయింటెనెన్స్ సమస్యలు, సర్వర్ సమస్యలు కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. యూట్యూబ్ సేవల్లో అంతరాయంతో ఇబ్బంది పడిన వారు ఇంటర్నెట్ కనెక్షన్ను సరిచూసుకోవాలని, కుకీస్ను క్లియర్ చేసుకోవాలని, మరొక డివైస్లో యూట్యూబ్ను ఓపెన్ చేసి చూడాలని టెక్ నిపుణులు సూచించారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే పూర్తిగా యూట్యూబ్ పరిధిలోని అంశం అని వదిలేయాలని చెప్పారు.