యూ ట్యూబ్ వ్యూయర్స్ ఎంతమంది ఉన్నారో, అందులో సగం మంది యూ ట్యూబ్ క్రియేటర్స్ కూడా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌కి అంత క్రేజ్ ఉంది మరి. అందుకే ఆ యాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్తో తెస్తుంటుంది. ఈ మధ్య వచ్చిన అప్డేట్స్ ఇవి...
ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియో స్పీడ్: ప్లేయర్ మీద రెండు సార్లు ట్యాప్ చేస్తే వీడియో10 సెకన్లు ముందుకు వెళ్తుంది. అయితే వీడియో ఫుల్ స్క్రీన్ లేదా పోట్రెయిట్ మోడ్‌లో చూసేటప్పుడు ప్రెస్ చేసి, కిందకి తీసుకెళ్తే ఆటోమెటిక్‌గా ప్లే బ్యాక్ స్పీడ్ 2ఎక్స్‌కి మారిపోతుంది. దాని మీద నుంచి వేలు తీస్తే, వీడియో నార్మల్ స్పీడ్‌లో ప్లే అవుతుంది. ఈ ఫీచర్ వెబ్, ట్యాబ్లెట్స్, మొబైల్స్‌లో అందుబాటులో ఉంది. దీన్ని ప్రతి వీడియోకి రెండు సార్లు వాడొచ్చు.
యూ ట్యాబ్ : లైబ్రరీ ట్యాబ్, అకౌంట్ పేజ్ని కలిపి, అంబ్రెల్లా ఆప్షన్లో పెట్టారు. దాని పేరు యూట్యాబ్. ఈ సెక్షన్లో ఇంతకుముందు చూసిన వీడియోలు, ప్లే లిస్ట్‌లు, డౌన్లోడ్స్, పర్చేజ్లు, అకౌంట్ రిలేటెడ్ సెట్టింగ్స్, ఛానెల్ ఇన్ఫర్మేషన్ వంటివి ఉంటాయి.
వాయిస్ సెర్చ్: యూట్యూబ్‌లో ఏవైనా వీడియోలు చూడాలంటే సెర్చ్ చేయడానికి టైప్ చేయనక్కర్లేదు. సాంగ్ ప్లే చేసినా, పాడినా, హమ్ చేసినా ఏ.ఐ. ద్వారా సౌండ్‌ని మ్యాచ్ చేసి రిజల్ట్‌లో చూపిస్తుంది.
యానిమేటెడ్ బటన్స్: యూట్యూబ్ క్రియేటర్ వ్యూయర్స్‌కి లైక్, సబ్స్క్రయిబ్ వంటివి చెప్తే వీడియో ప్లే అయ్యేటప్పుడు అదే సింక్‌లో బటన్స్ పైన కనిపిస్తాయి. వాటిని ట్యాప్ చేయగానే మెరుపులు కనిపిస్తాయి. అలాగే టాప్ కామెంట్స్ ఆటోమెటిక్‌గా రొటేట్ అవుతూ ఉంటాయి.