నిజామాబాద్ లో సైబర్ మోసాలకు యువకుడు బలి

నిజామాబాద్: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని అమాయక ప్రజలు డబ్బులను పోగొట్టుకోవడంతోపాటు ప్రాణాలు కూడా కోల్పోతున్న ఘటనలు ఇటీవల కాలంలో చోటుచుసుకుంటున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు సైబర్ మోసాలకు యువకుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళితే..  ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన నాగరాజు(19) అనే యువకుడు ఓ నిషేధిత ఆప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఇదే ఆ యువకుడు చేసిన పాపం.ఆ యువకుడు సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నాడు.

యువకుడికి ఫోన్, మెసేజ్ లు చేస్తూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధింపులుకు దిగారు. దీంతో వారి వేధింపులు భరించలేక యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసిన ఆర్మూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.