పిల్లలకైనా, పెద్దలకైనా నిద్ర చాలా అవసరం. ఏ ఏజ్ వాళ్లు ఎన్ని గంటలు నిద్ర పోవాలో కూడా కొన్ని స్టడీలు చెప్పాయి. అంతేకాకుండా ఎక్కువ లేదా తక్కువ నిద్రపోవడం వల్ల కలిగే లాభనష్టాలు అప్పుడప్పుడు చర్చకు వస్తుంటాయి. లేటెస్ట్ గా నిద్ర గురించి మరో ఇంట్రెస్టింగ్ స్టడీ జరిగింది.
పిల్లలు నిద్రపోయేటప్పుడు కొన్ని ఎక్స్ ప్రెషన్స్ పెడతారు. ఆ ఎక్స్ ప్రెషన్స్ బట్టి ఫ్యూచర్ లో వాళ్లకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? వాటిని వాళ్లెలా డీల్ చేస్తారు? అనేది తెలుసుకోవచ్చట. ఈ విషయం 'హూస్టన్ యూనివర్సిటీ' చేసిన స్టడీలో తేలింది. ఏడు నుంచి పదకొండేండ్లున్న 37మంది పిల్లలపై ఈ స్టడీ చేశారు. ఈ 37 మందిలో కొంతమంది అంతకుముందు రోజున హాయిగా నిద్రపోయిన వాళ్లు, కొంతమంది సరిగా నిద్రపోని వాళ్లు. వీళ్లకు రకాల ఫొటోలు చూపించారు.
ఐస్ క్రీమ్, పెట్ యానిమల్స్ లాంటి ఫొటోలు కొన్ని, ఇంజెక్షన్ చేయించుకుంటున్నట్టు, కుక్కల మీద పడుతున్నట్టు ఉన్న ఫొటోలు కొన్ని చూపించారు. బాగా నిద్రపోయినవాళ్లు ఈ రెండు రకాల ఫొటోలు చూసి మామూలుగానే రియాక్ట్ అయితే, సరిగ్గా నిద్రపోని పిల్లల రియాక్షన్ లో బెదురు, ఆందోళన కనిపించాయి. పిల్లలు పెరిగిన పరిసరాలు, వాళ్ల ఫ్యామిలీ పరిస్థితులను బట్టి కూడా మొహాల్లో తేడాలు కనిపించాయట. ఈ రెండు రకాల ఫొటోలను చూపిస్తూ పిల్లల ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ కెమెరాలో రికార్డ్ చేయమని పేరెంట్స్ కు చెప్పారు రీసెర్చర్లు.
దాంతో రెండేండ్ల పాటు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ, వీడియో రికార్డు చేశారు పేరెంట్స్. ఆ తరువాత వాళ్లు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు? అనేది గమనించారు. ఆ రిపోర్ట్స్ చూస్తే 'మేము అనుమానించినట్లే జరిగిందని' రీసెర్చర్స్ చెప్పారు. పాజిటివ్ ఫొటోలను చూపించినప్పుడు ప్రశాంతంగా నిద్రపోయారు. అదే భయపెట్టే ఫొటోలను చూసిన పిల్లల్లో నిద్ర తక్కువైంది.
దాంతో వాళ్ల మైండ్ మీద ఎఫెక్ట్ పడింది. ఈ పిల్లలు ఫ్రెండ్స్తో ఆడుకునేటప్పుడు గొడవలు పడేవాళ్లని, రిలేటివ్స్ మాట్లాడేటప్పుడు కోపంగా ఉండేవాళ్లని తెలిసింది. దీనిద్వారా నిద్ర తక్కువైతే బ్రెయిన్ పనితీరులో వచ్చే మార్పుల గురించి తెలిసిందన్నారు రీసెర్చర్స్.