బెంగళూరు: గెట్ టుగెదర్ పార్టీ తర్వాత ఇంటికి వెళ్తున్న డిగ్రీ స్టూడెంట్ పై లిఫ్ట్ ఇచ్చిన ఓ బైకర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున బెంగళూరులో ఈ దారుణం చోటుచేసుకుంది.
డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతి కోరమంగళలో గెట్టుగెదర్ పార్టీకి వెళ్లింది. పార్టీ పూర్తయ్యాక తెల్లవారుజామున తిరిగి హెబ్బగోడిలోని ఇంటికి బయల్దేరింది. ఈ సమయంలో ఆమె ఓ బైకర్‌ను లిఫ్ట్ అడిగింది. లిఫ్ట్ ఇచ్చిన ఆ అపరిచితుడు కొంతదూరం వెళ్లాక నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసేందుకు ఐదు టీములు గాలిస్తున్నాయని బెంగళూరు ఈస్ట్ జోన్ ఏసీపీ రామన్ గుప్తా తెలిపారు. క్లూస్‌టీమ్, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించాయని.. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు చెప్పారు. త్వరలోనే నేరస్తుడిని పట్టుకుంటామని అన్నారు.