ఫుల్గా తాగి ఈత పోటీ.. ఒడ్డుకు చేరలేక చెరువు మధ్యలోనే చిక్కుకుండు

ఈత పోటీ ఓ యువకుడి ప్రాణం మీదికి తెచ్చింది. ఊపిరాడక చెరువు మధ్యలోనే ఉండిపోయిన బాధితుడిని పోలీసులు కాపాడారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి చెందిన సుశాంత్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆదివారం స్థానిక పెద్దచెరువు దగ్గర మద్యం సేవించారు.

 తర్వాత చెరువు గట్టు నుంచి అవతలిపై ఈత పోటీ పెట్టుకున్నారు. ఎవరూ ముందుగా ఈత కొడుతూ చేరుకుంటారో తెల్చకుందామని ఒకరిపైఒకరు సవాళ్లు చేసుకున్నారు. ముగ్గురు చెరువులోకి దూకి ఈత కొడుతూ ఇద్దరు యువకులు అలసిపోయి తిరిగి ఒడ్డుకు చేరుకున్నారు. అయితే సుమంత్ మాత్రం గమ్యం చేరుకోలేక, ఒడ్డుకు రాలేక చెరువులోని బండరాయిపైనే చిక్కుకుపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ట్రాక్టర్ ట్యాబ్ సాయంతో ఒడ్డుకు చేర్చి కాపాడారు.