దుబాయ్​లో కారు ఢీకొని .. నిజామాబాద్ జిల్లా వాసి మృతి

బోధన్​, వెలుగు: దుబాయ్​లో గత నెల 31న జరిగిన యాక్సిడెంట్ లో నిజామాబాద్ జిల్లా బోధన్​ మండలం అమ్దాపూర్​ కు హరికృష్ణ(38) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉపాధి కోసం గత అక్టోబర్​24న దుబాయ్ వెళ్లాడని,అక్కడ రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మృతి చెందాడన్నారు. కంపెనీ ప్రతినిధులు ఈనెల7న కుటుంబానికి  సమాచారం ఇచ్చారన్నారు. 

గురువారం  హరికృష్ణ డెడ్ బాడీ వస్తున్నట్లు సమాచారం అందినట్లు చెప్పారు. హరికృష్ణకు భార్య కృష్ణవేణి, కొడుకు, కూతురు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.