నిజామాబాద్ జిల్లాలో ఘోరం.. యువజంట ఆత్మహత్య

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. రైలు కిందపడి యువదంపతులు ఆత్మహత్యకు చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్‌ జిల్లా పోతంగల్‌ మండలం హెగ్డోలికి చెందిన అనిల్,శైలజకు ఏడాది కిందట పెళ్లైంది. సోమవారం ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నామని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లారు. నవీపేట మండలం పకీరాబాద్‌- మిట్టాపూర్‌ మధ్యలో రైలుపట్టాల దగ్గరకు వెళ్లి తాము సూసైడ్ చేసుకుంటున్నామని వీడియో తీశారు.

 ఇందుకు బంధువుల దుష్పప్రచారాలను తట్టుకోలేక తాము బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నామని  కోటగిరి ఎస్సై సందీప్‌ చరవాణికి పంపారు. వెంటనే ఎస్సై అప్రమత్తమై లోకల్ లోని మరో పోలీసు అధికారికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి వారు ఉన్న స్థలానికి వెళ్లారు.

ALSO READ : కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

 

 రైలు పట్టాలపై ఇద్దరి మృతదేహాలు ఉండటం పోలీసులు గమనించారు. రైలు కింద పడి వారు బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తామని తెలిపారు.