మీకు తెలుసా: నీళ్లు కలిపిన పాలే ఆరోగ్యానికి మంచివి.. ఎందుకంటే ?

పాలు అనేక పోషక విలువలు ఉండే ఆహర పదార్థం. పాలు తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది స్వచ్చమైన పాలను తాగటానికే ఇష్టపడతారు. అయితే డైల్యూటెడ్ పాలు( నీళ్లు కలిపినవి) కూడా మంచి న్యూట్రిషియన్ వ్యాల్యూస్ కలిగి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వయసు ప్రకారం చూసుకుంటే ప్యూర్ మిల్క్ కాకుండా కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకున్న పాలే తాగాలంట. అవి జీర్ణశక్తికి, న్యూట్రిషినల్ బ్యాలెన్స్ కు దోహదపడతాయని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. డైల్యూటెడ్ మిల్క్ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • వయస్సు పెరుగుతున్నా కొద్దీ నార్మల్ పాల కంటే డైల్యూటెడ్ పాలే ఆరోగ్యానికి మంచిదని హెల్త్ ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.
  • 25 సంవత్సరాల వరకు స్వచ్ఛమైన పాలను తాగొచ్చని 25ఏళ్లుపైబడిన వారు నీళ్ళు కలిపిన పాలే తాగాలని న్యూట్రిషనిస్ట్  సైయిద్ అంటున్నారు.
  • పాలు అనేక పోషకాలు కలిగినవి కాబట్టి.. అవి జీర్ణ కావాడానికి ఎక్కువ టైం పడుతుంది. వయసు పెరుగుతుంటే మన ఫుడ్ హ్యబిట్స్ మార్చుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. 
  • డైల్యూటెడ్ మిల్క్ కెలరీలు, ఫ్యాట్, ప్రొటీన్, కాల్షియం వంటి పోషకాల ఇంప్యాక్ట్ ను తగ్గువగా కలిగి ఉంటాయి. పాల నుంచి మాంసం వరకు కావాల్సిన న్యూట్రీషియన్ వ్యాల్యూస్  అన్నీ బ్యాలెన్స్డ్ ఫుడ్ యే తీసుకోవాలట. శరీరంలో కాల్షియం ఎక్కువ అయినా అనారోగ్య సమస్యలు వస్తాయి. నీళ్లు కలిపిన పాలు తీసుకోవడం వల్ల కాల్షియం ఇన్ టేక్ తగ్గి బాడీలో అబ్షారషన్ సరిగ్గా ఉంటుంది.
  • అదే పనిగా ఓకే రకమైన పోషకాలను తీసుకుంటే శరీరానికి ప్రమాదం. డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి వ్యాధులు వస్తాయి. డైల్యూటెడ్ మిల్క్ లోయర్ కెలరీలు, లోయర్ సోడియం, తక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ బాడీలో బ్లబ్, షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. 25ఏళ్ల పైబడిన వారు న్యూట్రిషియన్లను సంప్రదించాలి.. టెస్టులు చేయించుకొని వారి వయసును బట్టి డైల్యూటెడ్ రేషియోను హెల్త్ కేర్ ప్రొఫ్రెషనల్స్ సూచించిన డైట్ ప్లాన్ ను అలవాటు చేసుకోవాలి.