వాట్సాప్ యాప్ వాడాలంటే కచ్చితంగా ఇంట ర్నెట్ ఉండాలి. అదే ఫొటోలు, వీడియోలు పంపాలంటే డాటా ఇంకాస్త ఎక్కువే ఖర్చు అవుతుంది. అయితే ఇక మీదట ఇంటర్నెట్ లేకుండానే వాటిని పంపొచ్చు అంటోంది వాట్సాప్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ యాప్ కొత్త ఫీచర్ తెచ్చింది. దాని ద్వారా ఇంటర్నెట్ లేకుండానే ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ వంటివి షేర్ చేయొచ్చు.
మామూలుగా అయితే నెట్వర్క్ లేకపోతే బ్లూటూత్ సాయంతో షేర్ఇట్, నియర్ బై షేర్ వంటి అప్లికేషన్ల ద్వారా షేర్ చేస్తుంటారు. అచ్చం అలాంటి సేవలనే ఇస్తోంది వాట్సాప్. దీనికోసం స్పెషల్‌గా యాప్ వాడాల్సిన పనిలేదు. డాక్యుమెంట్లను సేఫ్‌గా, స్పీడ్‌గా షేర్ చేస్తుంది ఈ ఫీచర్. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే వాట్సాప్ సిస్టమ్ ఫైల్, ఫొటోల గ్యాలరీ యాక్సెస్ లాంటి అనుమతులు ఇవ్వాలి.
పంపాలనుకుంటున్న వ్యక్తి మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ అయ్యేంత దగ్గర్లో ఉంటేనే ఆఫ్‌లైన్ షేరింగ్‌కు వీలవుతుంది. బ్లూటూత్ ఆన్ చేసి దగ్గర్లోని వాట్సాప్ యూజర్ డివైజ్ గుర్తించి ఫైల్ సెండ్ చేయాలి.అవతలి వ్యక్తి అందుకు పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడే షేర్ అవుతుంది. వద్దు అనుకుంటే ‘ఆఫ్’ చేసేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.