Indian Snacks : సాయంత్రం పూట పిల్లలకు క్రిస్పీగా.. ఇంట్లోనే పొటాటో ఫ్రై ఇలా చేయొచ్చు..!

క్రస్పీ ఆలు గడ్డల ఫ్రైకి కావాల్సిన పదార్థలు..

  • ఆలు గడ్డలు: రెండు కప్పులు (నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు), 
  • కార్న్ ఫ్లోర్ : రెండు టీ స్పూన్లు, 
  • కారం: ఒక టీ స్పూన్, 
  • పచ్చిమిర్చి: ఆరు, 
  • సోయాసాస్ : ఒక టీ స్పూన్,
  • టొమాటో సాస్: ఒక టీ స్పూన్, 
  • చిల్లీ సాస్: ఒక టీ స్పూన్, 
  • వెల్లుల్లి తరుగు: ఒక టీ స్పూన్, 
  • ఉల్లిగడ్డ: ఒకటి (తరుగు), 
  • ఉప్పు, నూనె: సరిపడా

తయారీ..

ఒక గిన్నెలో ఆలుగడ్డ ముక్కలతో పాటు కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాన్లో వేయాలి. తరువాత కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. మరో పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. ఇది వేడయ్యాక ముందుగా చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసి పక్కన పెట్టాలి. మరో పాన్లో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. అందులోనే సోయా, టొమాటో, చిల్లీ సాస్ లు వేసి వేగించాలి. చివరిగా ఉప్పు వేసి డీప్ ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి కలపాలి. టొమాటో సాస్తో ఈ పొటాటో ఫ్రై బాగుంటుంది.

ALSO READ :- Health Alert : ఆఫీసులో శుభ్రంగా ఎలా ఉండాలి.. ఎలాంటి జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండొచ్చు..!