Good Health : యువతలో మతిమరుపు రాకుండా మంచి చిట్కాలు..!

సాధారణంగా 60 ఏళ్లు దాటిన తరువాత మెదడు పనితీరు బలహీనపడుతుంది.  దీంతో మతిమరుపు వస్తుంది.  జ్ఞాపకశక్తి లోపించి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  అయితే హైటెక్​ యుగంలో వృద్దుల్లోనే కాదు యువతలో కూడా జ్ఞాపకశక్తి లోపిస్తుంది.  మతిమరుపు నుండి బయటపడేందుకు  నిపుణులు కొన్ని పరిష్కారమార్గాలను సూచించారు.

ALSO READ | మీకు మతిమరుపు ఉంటే ఇలా చేయండి

మతిమరుపు ఇది చాలా ప్రమాదకరం.. 50 సంవత్సరాలు దాటిన దగ్గరి నుంచి వయసుతో పాటు  జ్ఞాపకశక్తి  కూడా పెరుగుతుంది.  చేయాల్సిన పనులు గుర్తుండకపోవడం.. ఉప్పు కొందామని షాపునకు వెళితే పప్పు కొనడం ఇలా అనేకం జరుగుతుంటాయి.  ముఖ్యమైన డాక్యుమెంట్స్​ ఎక్కడ పెట్టామో కూడా మర్చిపోతుంటాం.  ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే నిపుణులు కొన్ని  ఈ పరిష్కారాలను సూచిస్తున్నారు. 

  • మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి.  ఎలాంటి అనవసర విషయాలను ఆలోచించకుండా ఉండాలి.  ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తుంటే దైవచింతనలో గడపండి
  • ఆహార​అలవాట్లను మెరుగుపరచుకోవాలి.  అలోవెరా, గిలోయ్​, అశ్వగంధతో తయారు చేసిన పదార్దాలు తినండి.  ఇలాంటి సహజంగా ఆయుర్వేద షాపుల్లో లభిస్తాయి.  అయితే వాటిని ఏ సమయంలో తినాలి.. ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయాలను వైద్యుల సలహా తీసుకోండి.  
  • మెదడును ఉత్తేజపరిచే వాటిని తినండి. బాదం, వాల్​నట్​ లను తినండి.  సాధారణంగా 60 ఏళ్లు దాటితే నమలడం కష్టం.  కావున వాటిని గ్రైండ్​ చేసి తినండి.
  • ప్రతిరోజు బాదం పప్పును పాలలో కలుపుకుని తాగండి. సాధ్యమైనంత వరకు కాఫీ, టీలకు దూరంగా ఉండండి.
  • ఎలాంటి ఒత్తిడికి లోనుకాకండి. టెన్షన్​ జీవితంలో నుండి బయటపడండి. బాధ్యతలు పిల్లలకు అప్పగించండి.  మీరు ఉద్యోగంలో నే కాదు.. బాధ్యతల్లో కూడా రిటైర్​ అవ్వండి. కాలక్షేపం కోసం దగ్గర్లోని ( కిలోమీటర్​ లోపు) ఉన్న దేవాలయానికి వెళ్లండి.
  • మార్నింగ్​ వాకింగ్​.. ఈవినింగ్​ వాకింగ్​ తో పాటు తేలికపాటి వ్యాయాలు చేయండి.
  • ఇంకా మీకు ఇష్టమైన పాటలు.. మ్యూజిక్​ వినండి.  ఇవి ఎలాంటి ఉద్రేకభరితంగా ఉండకూదు.
  • మీరు ఎక్కడకు వెళ్లినా.. రాత్రి 7 గంటలకు ఇంటికి చేరుకోండి.  రాత్రి 8 గంటల సమయానికి బెడ్​ పైకి చేరండి.  తొందరగా నిద్ర పట్టదనుకోండి.  అయినా మీరు ఆసమయాని నిద్రపోవడానికి ప్రయత్నిస్తే కనీసం 10 గంటలకైనా నిద్రపోగలుగుతారు.  రోజు 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం.  అప్పుడు మెదడు రీఫ్రెష్​ అవుతుంది.