LifeStyle : ఫ్యామిలీతో వీకెండ్ టూర్ వెళుతున్నారా.. ఇలా ప్లాన్ చేసుకోండి

రోజువారి ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ కావాలంటే వీకెండ్ లో టూర్ ప్లాన్ చేసుకుంటే బెటర్. అయితే, టూర్ ప్లాన్ అనగానే చాలా విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే టూర్ ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. 

ఏదైనా టూరికి వెళ్లాలనుకోగానే ముందుగా ఎక్కడికి ఎంతమంది వెళ్లాలి? ఏమేమి ప్యాక్ చేసుకోవాలి? లాంటివి ముందే ప్లాన్ చేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరో విషయం. వెళ్లే ప్రాంతంలో వాతావరణ పరిస్థితులను కూడా చూసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెకేషన్ ను ఎంజాయ్ చేయొచ్చు. అలాగే టూర్ అంటే తెలియకుండానే దుబారా ఖర్చులు చేస్తారు. వీటిని నియంత్రించుకుంటే అనుకున్న బడ్జెట్లోనే సక్సెస్ ఫుల్ టూర్ ని పూర్తి చేయొచ్చు.

హాయిగా ఉండాలి..

వెళ్లాలనుకునే ప్రాంతాన్ని బట్టి, అక్కడి వాతావరణానికి తగినట్టు సౌకర్యంగా ఉండే దుస్తులు ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలైతే కాటన్ లేదా మెత్తని క్లాత్ డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం వదులుగా ఉంటే మంచిది. అలాగే బ్యాగ్ డ్రెస్సులు సర్దుకునేటప్పుడు స్ట్రెచబుల్ ఉండేవి. అయితే మడత పెట్టకుండా రోల్ చేయాలి. ఇలా చేయడం బ్యాగ్లో ఎక్కువ డ్రెస్సులు పడతాయి. మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్స్ . టోనర్స్.. లాంటి వస్తువులకే ట్రావెల్ బ్యాగ్ లో సగం స్థలం సరిపోతుంది. అయితే, ఇలాంటి సమస్య లేకుండా మల్టీటాస్కింగ్ ప్రొడక్ట్స్ అయితే బెటర్. చర్మ సంరక్షణతో పాటు జుట్టును కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తగలకుండా టోపీ లాంటివి ఉపయోగించాలి. సమీపంలో ఉన్న ప్రాంతాలకు రైల్లో వెళ్లడం ఉత్తమం. కనీసం 12 గంటల ప్రయాణం వరకు రైలు ప్రయాణమే అదనుగా ఉంటుంది. అంతకు మించి ఉంటే ఇతర మార్గాలు ఎంచుకోవచ్చు.

ఫుడ్ విషయంలో

ప్రయాణాల్లో ఎక్కువగా జంక్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ తింటారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ ఫుడ్స్ వల్ల డీ హైడ్రేషన్తో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్స్ వస్తాయి. కాబట్టి ప్రయాణాల్లో స్ట్రీట్ ఫుడ్ కు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. 

ఎక్కువగా నీళ్లు

ప్రయాణాల్లో దాహం వేసే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పండ్ల రసాలు లాంటివి కూడా తీసుకోవాలి. తలనొప్పి, వాంతులు, విరేచనాలు... లాంటివి తగ్గడానికి మందులు దగ్గర పెట్టుకోవాలి. టూర్ కి సొంత వాహనంలో వెళ్తుంటే మధ్యమధ్యలో అపి రెస్ట్ తీసుకోవడం వల్ల అలసట అనిపించదు.

* వేసవి వచ్చేసింది. ఇప్పుడిప్పుడే ఉష్ణో గ్రతలు పెరుగుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం పొందడానికి, కొత్త ప్రదే శాలు చూడటానికి టైం దొరికేది కూడా ఇప్పుడే. కాబట్టి, ఈ వేడిలో టూరు వెళుతున్నపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 
* టూర్ కు వెళ్లిన తర్వాత అలసట ఉందని కూర్చోకుండా యాక్టివ్ గా ఉండటా ప్రయత్నించాలి. సైట్ సీయింగ్, వాకింగ్, షాపింగ్, స్విమ్మింగ్... లాంటివి చేస్తూ హ్యాపీగా గడపొచ్చు. ౦ వేసవి టూర్లో డీహైడ్రేషన్కు గురికా కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ బాటిల్ వెంట ఉండేలా చూసుకోవాలి. అలాగే జ్యూస్లు, లిక్విడ్స్ తరచూ తాగాలి.
* ఇంటి నుంచే కొంత ఫుడ్ ను ప్యాక్ చేసి వెంట పెట్టుకోవాలి. ప్రొటీన్ పౌడర్, నట్స్, చియా సీడ్స్ లాంటివి తీసుకెళ్లే మంచిది. టూర్ వెళ్లిన ప్రాంతానికి దగ్గర లో మార్కెట్ ఉంటే ఫ్రూట్స్ కొని పెట్టుకో
వాలి. క్యారెట్, కీరదోస, నిమ్మకాయలు లాంటివి మంచి ఆప్షన్. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు కలిసి వెళ్లేటప్పుడు ఆహా రాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 
* సిటీకి దూరంగా వెళ్లాల్సి వచ్చినపుడు, ట్రెక్కింగ్ లాంటివి చేస్తున్నప్పుడు.. దగ్గర లో ఎలాంటి ఆహారం దొరక్కపోవచ్చు. కాబట్టి ముందే స్నాక్స్ ఉండేలా జాగ్రత్త పదాలి. ఫోన్ చార్టర్లు లాంటి ఎమర్జెన్సీ వస్తువులు కూడా తప్పనిసరిగా ఉంచుకోలి.
* పిల్లల కోసం కొంత టైం, వారికి కావా వస్తువులు తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. దాంతో వాళ్లు వాటితో డుకుంట.. పెద్దలను విసిగించరు. 
* స్థానికంగా ఫేమస్ అయిన ఆహారం కంటే.. నచ్చే ఆహారాన్ని ముందు తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఆహారం పడకపోతే ఇబ్బందే. ఉడికించిన కోడి గుడ్లు, ఓట్ మీల్ లాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.