Good Health : సోడా తాగుతున్నారా.. అయితే మీకు షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది..!

తీపి పదార్థాల కన్నా కృత్రిమ పానీయాలతోనే టైప్ 2 మధుమేహ ముప్పు అధికమని కెనడాకు చెందిన సెయింట్ మైఖేల్ హాస్పిటల్, టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఫ్రక్టోజ్ తో  కూడిన డైట్... ఆహారంలో పోషక రహిత శక్తిని చొప్పించి రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రమాదం చూపుతుందని పరిశోధకుల అధ్యాయనాల ద్వారా తెలిసింది.

అయితే పండ్లు, కూరగాయలు, సహజసిద్ధమైన పండ్ల రసాలు, తేనె.. లాంటి ఆహారం, పానీయాలతో ఎలాంటి ముప్పు లేదని వెల్లడించారు. సోడాతో పాటు శీతల పానీయాలు, బేకరీ పదార్ధాలు, స్వీట్లకు దూరంగా ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు.

Also Read :- ఈ వెజ్ ఫుడ్ అలవాటు చేసుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం

అదనపు క్యాలరీలు లేని ఫ్రక్టోజ్ చక్కెరతో కూడిన ఆహారంతో ఎలాంటి అనర్థం ఉండదని పరిశోధక బృందం తేల్చింది. డయాబెటిస్ తో బాధపడే వారిలో చక్కెరలో గ్లూకోజ్, ఇన్సులిన్ నియంత్రించేందుకు తాజా పండ్లు, పండ్ల రసాలు ఉపయోగపడతాయని ఓ అధ్యయనం వెల్లడించడం గమనార్హం. శీతల పానీయాలతో మాత్రం మధుమేహుల ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురవుతాయి.

-వెలుగు,లైఫ్-