షుగర్ ఉన్నవాళ్లు ఈ 5 యోగాసనాలు చేయండి.. మంచి ప్రయోజనాలు పొందుతారు

డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో యోగా సమర్థవంతమైన సాధనం. కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయొచ్చంటున్నారు యోగా నిపుణులు. షుగర్ వల్ల కలిగే దుష్పరిణామాలను అడ్డుకోవచ్చు. యోగా ద్వారా విశ్రాంతి, కొన్ని రకాల రోగాలకు చికిత్స ను పొందవచ్చు. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుంది. మీ శరీరాన్ని, మెదడును విశ్రాంతి పర్చడమే కాకుండా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఉరుకులు పరుగుల జీవింలో మధుమేహాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైన పని. కాబట్టి డయాబెటిస్ ను నియంత్రించడానికి యోగాను సమర్థవంతమైన సాధనంగా ఉపయోగించుకోవచ్చు. ఇది రక్తంలో  చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం ద్వారా కలిగే దుష్పరిణామాలను తగ్గిస్తుంది.  డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి యోగా ఎంతో సహాయ పడుతుంది. 

Also Read :తెలంగాణలో భారీ వర్షాలు.. 7 జిల్లాలకు రెయిన్ అలెర్ట్

మధు మేహం( డయాబెటిస్ ) కోసం యోగాసనాలు 

కూర్చుని ముందుకు వంగి(పశ్చిమోత్తనాసనం 

కూర్చుని ముందుకు వంగి చే సే యోగాసనాన్ని పశ్చిమోత్తనాసనం అంటారు. ఇది పొట్ట, కటి అవయవాలకు మసాజ్ చేస్తుంది. ఇది మూత్ర పిండ వ్యవస్థ , ప్యాంక్రియాస్ పనితీరును మెరుగు పరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను కూడా తగ్గిస్తుంది. అలసటను కూడా తగ్గిస్తుంది.

నాగలి భంగిమ(హలాసనం)

హలాసనం డయాబెటిస్ నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇది థైరాయిడ్ గ్రంథిని కూడా ప్రేరేపిస్తుంది. ప్రసరణను పెంచుతుంది. ఒత్తడిని తగ్గిస్తుంది. నాగలి భంగిమ ఆసనం(హలాసనం) .. వెన్నునొప్పి, తలనొప్పి, నిద్రలేమి నుంచి రిలీఫ్ ను ఇస్తుంది. 

విల్లు భంగిమ(ధనురాసనం) 

ఇది ప్యాంక్రియాస్(క్లోమగ్రంథి) ను బలపరుస్తుంది. అందుకే ధనురాసనాన్ని మధుమేహం ఉన్నవారికి ఎక్కువగా సిఫారసు చేస్తుంటారు. ఇది మీ ఛాతిని కూడా తెరుస్తుంది. పొట్ట అవయవాలను ప్రేరేపిస్తుంది. ఈ భంగిమ జీవక్రియ, శ్వాస కోశ ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో కూడా సహాయ పడుతుంది. 

పిల్లల భంగిమ (బాలాసనం)

పిల్లల భంగిమ ఇది మీ మానసిక ఆరోగ్యానికి మంచిది. ఇది విశ్రాంతిని ఇస్తుంది. మెరుగైన ఇన్సులిన్ పనితీరును ప్రోత్సహిస్తుంది. బాలాసనం ద్వారా ఒత్తిడి, ఆందోళన, అలసన, నిరాశ లక్షణాలను సమర్థవంతంగా ఎదుర్కొవడంలో సహాయ పడుతుంది. ఇది మెరుగైన నిద్రను అందిస్తుంది. 

శవ భంగిమ(శవాసనం)

శవాసనం అనుకున్నంత సులువు కాదు. సరిగ్గా నిర్వహించాలి. శవాసనం రక్తపోటును తగ్గిస్తుంది. మనస్సును, శరీరాన్ని ప్రశాంత పరుస్తుది. తలనొప్పి, నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచిది.  శవాసనం ఒత్తిడి, ఆందోళనను తగ్గించడం సహాయ పడుతుంది. 
ఈ యోగాసనాలను ప్రయత్నించినట్లయితే మీరు డయాబెటిస్ ను సమర్థవంతంగా ఎదుర్కొవచ్చు.