ఏప్రిల్ 26 నుంచి రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవాలు

ఎడపల్లి, వెలుగు : ఎడపల్లి మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవ కార్యక్రమాలను ఈ  నెల26 నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఎడపల్లి  కౌండిన్య గౌడ సంఘం నాయకులు తెలిపారు. ఆదివారం కల్యాణ మహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు.  ఈ నెల 26 న గ్రామంలోని గౌడ కులస్తుల ఇండ్లలో జోగు ఎత్తుట

27 న ఏడు ఊర్లలో జోగెత్తుట, 28 న వేయికండ్ల బోనం సమర్పణ,29 వ తేదీన ఎడంత్రాల బోనం సమర్పణ, 30 వ తేదీన అమ్మ వారి కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో గౌడ కుల సంఘం నాయకులు ఆర్ ఎల్లా గౌడ్, పుట్ట నర్స గౌడ్, కే. మల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు.