మహాసభను సక్సెస్ చేయాలి : వెంకటేశ్​

చండూరు (గట్టుపల), వెలుగు : ఈనెల 12న మునుగోడులో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణతోపాటు కురుమ యువ చైతన్య సమితి 5వ మహాసభను నిర్వహించనున్నట్లు కేవైసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్​తెలిపారు. ఆదివారం గట్టుప్పల్ మండలం తెరటుపల్లిలో  ‘హలో కురుమ-.. చలో మునుగోడు’కు సంబంధిత పోస్టర్ ను సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు పలువురు నాయకులు హాజరవుతారని తెలిపారు. కరుమ యువ చైతన్య సమితి మహాసభకు కులస్తులంతా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షుడు రావుల ఐలయ్య, ప్రధాన కార్యదర్శి బండారు శంకర్, మునుగోడు ఇన్​చార్జి మందుల సత్యం, నాయకులు కాలిన మల్లేశ్, నర్రి లింగం, కోరిక సత్తయ్య, దెందే భిక్షం, నరేందర్, శంకర్ పాల్గొన్నారు.