ఫోన్​ లేకుండా ఆరు నెలలు

ఈ రోజుల్లో ఫోన్​ వాడకుండా ప్రయాణాలు చేయడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే టికెట్ బుకింగ్ నుంచి లొకేషన్ షేరింగ్, ఫుడ్ ఆర్డర్స్, పేమెంట్స్.. ముఖ్యంగా కమ్యూనికేషన్ గ్యాప్​ రాకుండా ఫోన్​లు వాడడం పరిపాటి అయిపోయింది. కానీ, చైనాకి చెందిన ఒక వ్యక్తి మాత్రం ఫోన్​ లేకుండా ఆ దేశంలో134 రోజులు వేరువేరు ప్రాంతాలకు జర్నీ చేశాడట. సొంత దేశమైతే మాత్రం ప్రాంతాలు మారతాయి. కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులు ఉంటారు కదా. కానీ, అతనికి ఆ విషయాల్లో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. 

యాంగ్ హవో.. పీహెచ్​డీ స్కాలర్. షాంగి ప్రావిన్స్ రాజధాని తైవాన్ అతని స్వస్థలం. అక్కడి నుంచి పోయినేడాది నవంబరులో తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆరునెలలుగా తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పటికే 24 ప్రావిన్సులు, పలు ప్రాంతాలను చుట్టేశాడు. ఈ సందర్భంగా తన అనుభవాలను డాక్యుమెంట్‌ చేసేందుకు ఇంటర్నెట్​ లేని రెండు కెమెరాలు తీసుకున్నాడు. 

ఫోన్ మనకు డిజిటల్ ఆర్గాన్ లాంటిదని నేను భావిస్తా. అది లేకుండా చాలా పనులు చేయలేం. అందుకే అసలు ఇంటర్నెట్ లేకపోతే ఏం జరుగుతుందో చూడాలి అనుకున్నా. అందుకే ఈ సాహసం చేశాన’’ని చెప్పాడు హవో.
 ప్రస్తుతం ఆయన జర్నీలో రాసిన స్టోరీలకి ఇంకొంత ఇన్ఫర్మేషన్​ కలిపి ఒక పుస్తకాన్ని రాస్తాడట. ఇప్పటికయితే ప్రతీ విషయాన్ని పేపర్​ మీద రాసుకున్నాడు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తీసిన ఫొటోలతో ఒక డాక్యుమెంటరీ కూడా తీస్తున్నాడు. 

హవో అనుభవాలు ఇవే..

‘‘చైనా మొత్తం ఫోన్​ లేకుండా తిరగడం ఛాలెంజింగ్​. హోటల్ బుకింగ్, టాక్సీ ఎక్కడం వంటి పనులు కూడా చాలా కష్టమైపోయింది. చాలా షాపుల్లో కార్డ్ మెషిన్లు లేవు. విత్ డ్రా కోసం ఏటీఎంలు వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ, తోటి ప్రయాణికులు, స్థానికుల సాయంతో సమస్యలకు సొల్యూషన్ దొరికింది. నేను మొబైల్ వాడట్లేదని తెలిసి అందరూ షాక్​ అయ్యారు. కొందరైతే ఏదైనా చెడ్డపని చేస్తున్నావా? అని అడిగేవాళ్లు. 

ఫోన్ లేకపోవడం వల్ల పుస్తకాలు చదవడం, రాయడం వంటివి చేశా. ఏప్రిల్​ నెలలో ఇంటికి చేరుకున్నా. ఈ ప్రయాణంలో అందరూ మోడర్న్​ లైఫ్​లో ఉంటే నేను మాత్రం పాతకాలపు మనిషిలా ఉన్నా. ఈ జర్నీలో ఎదురైన కష్టాలు, సంతోషాలు అన్నీ ఎగ్జయిటింగ్​గా అనిపించాయి. ఇది లైఫ్ టైం మెమొరీ” అన్నాడు హవో.