కార్తీక శోభ: యాదాద్రి దేవాలయం .. వరంగల్​ వేయిస్తంభాల గుడి.. భక్తులతో కిటకిట

కార్తీక పౌర్ణమి  సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి అలయం భక్తుల తో సందడిగా మారింది...ఆలయ పరిసరాల్లో భక్తులు కోలాహలం నెలకొంది....నరసింహుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు...అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు...కార్తీక దీపారాధనలు చేశారు....అనుబంధం అలయమైన శివాలయంలో పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు..పుష్కరిణి లో పుణ్యస్నానాలు చేశారు. 

ఇక జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో తెల్లవారు జామునుంచే ( నవంబర్​ 15న)  భక్తులు కార్తీక స్నానాలు ఆచరించి.. దీపాలు వెలిగించారు. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తుల  పుణ్యస్నానాలు ఆచరించి గోదావరిమాతకు ప్రత్యేక పూజలు చేశారు.   శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి  అభిషేకంతో పాటు విశేష పూజలు జరిగాయి.  భక్తులు ఉసిరిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు.  ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయం  శివనామ స్మరణతో మారుమోగింది. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.  వరంగల్ జిల్లాలో  వేయి స్తంభాల గుడి, రామప్ప, కాలేశ్వరం, సిద్దేశ్వర ఆలయంలో తెల్లవారు జాము నుండే భక్తుల కిటకిటలాడారు.  కాళేశ్వర త్రివేణి సంఘం నదీ స్నానాలు ఆచరించి భక్తులు దీపాలు వెలిగించారు. వేయిస్తంభాల గుడిలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వేయిస్తంభాల గుడిలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.