యాదగిరిగుట్టకు కాసుల వర్షం.. కార్తీక మాసంలో రూ. 18 కోట్లు

  • కార్తీకమాసంలో రూ.18.03 కోట్ల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు: కార్తీక మాసంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కాసుల వర్షం కురిసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.2.95 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చింది. ఈసారి రూ.18,03,40,051 ఇన్ కం రాగా, 2023లో రూ.15,08,36,661 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

కల్యాణకట్ట ద్వారా రూ.20.09 లక్షలు, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.76.20 లక్షలు, బ్రేక్  దర్శనాలతో రూ.81.01 లక్షలు, వ్రతాల ద్వారా రూ.1.86 కోట్లు, వాహన పూజల ద్వారా రూ.3.75 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.1.37 కోట్లు, శీఘ్ర దర్శనాలతో రూ.1.72 లక్షలు, ప్రచార శాఖ ద్వారా రూ.10.78 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.1.23 కోట్లు, గదుల కిరాయి ద్వారా రూ.32.21 లక్షల ఆదాయం సమకూరింది.