యాదాద్రిలోడ్యూటీకి అధికారుల డుమ్మా..కలెక్టర్ సీరియస్​

  • సీహెచ్​సీ సూపరింటెండెంట్, స్పెషలాఫీసర్​ సహా 16 మందికి షోకాజ్ నోటీసులు
  • సక్రమంగా విధులు నిర్వహించిన డాక్టర్​కు అభినందనలు

యాదాద్రి, వెలుగు : డుమ్మాకొట్టిన, డ్యూటీకి ఆలస్యంగా వచ్చిన ఎంప్లాయిస్​కు యాదాద్రి కలెక్టర్ ఎం.హనుమంతరావు షాక్​ ఇచ్చారు. విధులకు గైర్హాజరు, ఆలస్యంగా వచ్చిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.​ నోటీసులు అందుకున్న వారిలో సీహెచ్​సీ సూపరింటెండెంట్, స్పెషలాఫీసర్​ సహా 16 మంది ఎంప్లాయిస్​​ఉన్నారు. యాదాద్రి జిల్లా హైదరాబాద్​ నగరానికి అతి దగ్గరగా ఉంది.

అందుకే ఈ జిల్లాలో పని చేయడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ పనిచేసే ఆఫీసర్లు, ఎంప్లాయిస్​ ఎక్కువ మందిహైదరాబాద్ ​నుంచే అప్​ అండ్​ డౌన్ చేస్తుంటరు. డ్యూటీకి ఇష్టమొచ్చినట్టు రావడం, అసలు రాకపోవడం సాగుతోంది. నాలుగు రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం.హనుమంతరావు ముందుగా ఈ అంశంపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. 

జిల్లాలో విస్తృత పర్యటన, తనిఖీలు..

దీపావళి పండుగ తెల్లారే.. కలెక్టర్ హనుమంతరావు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. పరిపాలన చక్కదిద్దే పనిలో పడ్డారు. రివ్యూలు, ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆలేరు సీహెచ్​సీని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లోకి వెళ్లి పేషెంట్లను పలకరించి అందుతున్న సేవలపై ఆరా తీశారు. మెడిసన్​ సరఫరా వివరాలతోపాటు నిల్వలను పరిశీలించారు. అటెండెన్స్​రిజిస్టర్​ను పరిశీలించారు. నైట్ డ్యూటీ డాక్టర్​విధుల్లో ఉన్నారని, హాస్పిటల్ సూపరింటెండెంట్​స్వప్ప రాథోడ్​, మరో ముగ్గురు డాక్టర్లు డ్యూటీకి రాని విషయం ఆయన దృష్టికి వచ్చింది.

దీంతో హాస్పిటల్ సూపరింటెండెంట్ స్వప్న , డాక్టర్లు శ్రీధర్, స్వప్న, రజినికి షోకాజ్​నోటీసులు జారీ చేశారు. అనంతరం గుండాల పీహెచ్​సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్​పరిసరాలను పరిశీలించారు. అటెండెన్స్​రికార్డులు తనిఖీ చేయగా పీహెచ్​సీ హెల్త్​ ఆఫీసర్​ వెంకటేశం, ఎంపీహెచ్​ఎస్​ కరుణ, పీహెచ్​ఎన్​ వనజాకుమారి ఇంకా రాలేదని తేలింది. దీంతో ఆ ముగ్గురికి షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. ఆలేరులో నిర్వహంచిన సమగ్ర కుటుంబ సర్వే రివ్యూలో మండల స్పెషలాఫీసర్, డీఏవో ​ గోపాల్​ ఆలస్యంగా వచ్చారు.

దీంతో ఆగ్రహించిన కలెక్టర్​ ఆయనకు కూడా షోకాజ్​నోటీసు జారీ చేశారు. గుండాల పీఏసీఎస్​ పరిధిలోని వడ్ల కొనుగోలు సెంటర్​ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు సెంటర్ లో టాబ్స్, మాయిశ్చరైజర్ మిషన్లు , ప్యాడి క్లీనర్స్  లేకపోవడంతో అధికారులపై సీరియస్​ అయ్యారు. ముఖ్య కార్యనిర్వాహణ అధికారి నాగయ్య, వ్యవసాయ విస్తరణాధికారి క్రాంతి లేకపోవడంతో వీరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని సంబంధిత ఆఫీసర్లను 
ఆదేశించారు. 

సర్వేలో పాల్గొనని ఏడుగురికి షోకాజ్..

సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణకు పలువురు అంగన్వాడీ టీచర్లకు డ్యూటీ వేశారు. అయితే ​డ్యూటీ వేసినా ఆలేరు ప్రాజెక్టు పరిధిలోని ఏడుగురు సర్వేకు వెళ్లలేదు. దీంతో కలెక్టర్​ఆదేశాల మేరకు వారికి షోకాజ్​నోటీసులు జారీ చేశారు. అడ్డగూడూరు పీహెచ్​సీని కలెక్టర్​ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్​పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం, వచ్చిన పేషెంట్లకు సకాలంలో ట్రీట్​మెంట్​ అందిస్తున్న తీరును పరిశీలించారు. హాస్పిటల్ చక్కగా నడిపిస్తున్న డాక్టర్​ప్రవీణ్​కుమార్​ను కలెక్టర్​అభినందించారు. 

సమగ్ర కుటుంబ సర్వేపై రివ్యూ..

జిల్లాలోని ఆలేరు, గుండాల, అడ్డగూడురు, ఆలేరు మున్సిపాలిటీల్లో పర్యటించిన ఆయన సంబంధిత ఆఫీసర్లతో సమగ్ర కుటుంబ సర్వేపై రివ్యూ నిర్వహించారు. సర్వే వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని ఆదేశించారు. ధరణి అప్లికేషన్లను పెండింగ్​లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు.