జనరల్​ స్టడీస్​​: సూఫీ మూవ్​మెంట్.. ప్రత్యేక కథనం​

సూఫీతత్వం 9, 10వ శతాబ్దాల్లో ప్రారంభమైంది. సుఫ్​ అంటే ఉన్ని , విజ్ఞానం అని అర్థం. సూఫీ అనే పదాన్ని మొదటిసారిగా ఇరాక్​లోని బస్రాలో 9, 10వ శతాబ్దంలో జహిజ్​ వినియోగించారు. ఇది మార్మికవాద సంస్కరణోద్యమం. దీనికి భక్తి ఉద్యమంతో పోలికలు ఉన్నాయి. ఇది భారతదేశం బయట ఆవిర్భవించింది. ఆ తర్వాత కొంత మంది సన్యాసులు సుఫీతత్వాన్ని భారతదేశంలోకి తీసుకువచ్చారు. సూఫీ ఉద్యమ ముఖ్య ఉద్దేశం జాతి వివక్షను నిర్మూలించడం. సూఫీతత్వం గురించి ప్రస్తావిస్తూ అబుల్​ ఫజల్​ 14 సిల్​ సిలలు(వివిధ శాఖలు) ఉన్నాయని తెలిపాడు. వీరు పర్షియన్​ సంప్రదాయాలను, ఉలేమాల ఆధిపత్యాన్ని తిరస్కరించాడు.  సూఫీ తత్వపరంగా రెండు రకాలుగా ఉన్నది.  అవి.. బాషరా, బేషరా. 

  • బాషరా: షరియత్​ ఆధిపత్యం, ఉన్నతిని గుర్తించి గౌరవించడం (ఇస్లాం న్యాయాన్ని పాటించేవారు) 
  • ఉదా: చిస్తీ, సుహ్రవర్ధి
  • బేషరా: షరియత్​ను తిరస్కరించడం. అంటే ఇస్లాం న్యాయాన్ని పాటించరు. 

ఈ వర్గం భారతదేశంలోకి ప్రవేశించలేదు. 

సూఫీలపై భారతీయ ప్రభావం: సూఫీలపై బౌద్ధుల ప్రభావం ఎక్కువగా ఉన్నది. మధ్య ఆసియాలో ఇస్లాంకు పూర్వం బౌద్ధం విలసిల్లడమే ఇందుకు కారణం. అలాగే, భారతదేశంలోని సూఫీలపై హిందూ సాధు సంత్​ల ప్రభావం పడింది. అమృత్​ కుంద అనే పండితుడు సంస్కృతంలో రచించిన హస్తయాగ గ్రంథం పర్షియన్​ భాషలోకి తర్జుమా చేయగా, దానిలోని అనేక అంశాలు ఇస్లాంలోకి ప్రవేశించి తర్వాత సూఫీలపై ప్రభావం చూపింది. బానిస, ఖిల్జీ, తుగ్లక్​ వంశాల కాలంలో ఉన్న సూఫీ సాధువు హజ్రత్​ నిజాముద్దీన్​. ఇతను ప్రాణాయామం చేస్తూ స్థానిక హిందువుల్లో సిద్ధ్​గా పేరుగాంచాడు.  

సూఫీ సిద్ధాంతం: వీరు ఏకేశ్వర ఉపాసకులు. వీరికి నమాజ్(ప్రార్థన), హజ్(తీర్థయాత్ర), రోజా(ఉపవాసం)లపై నమ్మకం లేదు. భగవంతునికి సంగీతం ఇష్టమని నమ్ముతారు. భగవంతున్ని చేరడానికి పీర్(గురువు)​ అవసరం ఉందని భావిస్తారు. వీరు హిందువుల అగ్నిపూజ, యజ్ఞోపవీతధారణ, యోగాలను అనుసరించారు. 

సూఫీ సిల్​సిలలు

చిస్తీ సిల్​సిల​: ఈ శాఖను ఇరాన్ లో ఖ్వాజా అబూ అబ్దుల్లా చిస్తీ ప్రారంభించారు. దీనిని భారతదేశంలోకి షేక్​ మొయినుద్దీన్​ చిస్తీ తీసుకువచ్చాడు. 

సుహ్రవర్ధి  సిల్​సిల​:ఈ శాఖను బాగ్దాద్​ వాస్తవ్యుడు షేక్​ షహిబుద్దీన్​ సుహ్రవర్ధి స్థాపించాడు. ఇతను భారతదేశానికి వచ్చి ముల్తాన్​లో స్థిరపడ్డారు. వీరు సారవంతమైన నేలలు బహుమతులుగా తీసుకునేవారు. వీరు రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు. 

ఖాద్రి  సిల్​సిల​: షేక్​ అబ్దుల్​ ఖాదిర్​ జిలాని ఈ శాఖను బాగ్దాద్​లో 15వ శతాబ్దంలో ప్రారంభించారు. దీనిని భారతదేశంలోకి తీసుకువచ్చింది షేక్​ నియామతుల్ల. మొఘలుల కాలంలో ఇది అధికంగా ప్రాచుర్యంలో ఉంది. మొఘలుల పాలకుడైన ధారషికో దీనిని అనుసరించి ప్రోత్సహించారు. ఇది సింధూ, లాహోర్ ప్రాంతంలో అధికంగా ప్రాచుర్యంలో ఉన్నది. 

నక్షబంది  సిల్​సిల​: దీనిని ఖ్వాజా ఒబైదుల్లా స్థాపించాడు. ఇతను వలదిన్​ రిసాలత్​ అనే గ్రంథం రచించారు. ఇతన్ని బుకారా వద్ద ఖననం చేశారు. ఈ శాఖను భారతదేశంలోకి ఖ్వాజా బాఖిబిల్లా తీసుకువచ్చాడు. 
మెహదవి వర్గం: మహమ్మద్​ మాది ఈ శాఖను జౌన్​పూర్​ లో 15వ శతాబ్దంలో స్థాపించారు. తనకు తానే మెహది అని పిలుపించుకునేవాడు. మెహదవి వర్గం షార్కీ వంశ పాలకులు, గుజరాత్​ సుల్తానులు అనుసరించారు. వీరు జిక్రి (దైవనామస్మరణ) ప్రాధాన్యతను ఇచ్చారు. 

రౌషనీయ సూఫీ శాఖ: భారతీయ సూఫీ వర్గం. 16వ శతాబ్దంలో జలంధర్​కు చెందిన బయాజిద్​ అన్సారీ ప్రారంభించారు. 
సత్తారి శాఖ: 15వ శతాబ్దంలో బెంగాల్​లో ప్రారంభమైంది. దీనిని షేక్​ అబ్దుల్​ సత్తార్​ స్థాపించాడు. ఈయన దర్గా మధ్యప్రదేశ్​లోని మండులో ఉన్నది. 

ఫిరదౌసి శాఖ: ఈ శాఖ సుహ్రవర్ధి ఉపశాఖ. కశ్మీర్​లో మీర్​ సయ్యద్​ అలీ హందారే ప్రారంభించారు. సుల్తాను జైలాబ్దిన్​ దీనిని ప్రోత్సహించారు. ఈ శాఖ దారిద్ర్య జీవనాన్ని విశ్వసించింది.
నయాసూఫీలు: ఈ శాఖ సుహ్రవర్ధి ఉపశాఖ. కశ్మీర్​లో మీర్ సయ్యద్​ అలీ హందారే ప్రారంభించారు. సుల్తాన్ జైనలాబ్దిన్​ దీనిని ప్రోత్సహించారు. ఈ శాఖ దారిద్ర్య జీవనాన్ని విశ్వసించింది.

సూఫీలో విప్లవ వాదం

18వ శతాబ్దంలో రెచ్చగొట్టేలా మత బోధకులు బోధనలు ప్రారంభించారు. ఇందులో బుల్లేషా ముఖ్యుడు. ఈయన కాన్​స్టాంటీనోపుల్​కు చెందినవాడు. పంజాబ్​లో స్థిరపడ్డాడు. ఇతను అన్ని మతాలను తిరస్కరించాడు. సూఫీ ఉద్యమ బోధకుల్లో ముఖ్యులు దాదాపుగా ఖసాబ్​ (మాంసం విక్రయించే కులం), హల్లజ్​(నేత పనివారు) కులాలకు చెందినవారే.

సూఫీ పదజాలం

  • కాన్​ ఖ(ఆశ్రమం): ఇది గురువుల నివాసం. వీటి కోసం ముస్లిం పాలకులు ఉచితంగా భూములు కేటాయించేవారు. గురు శిష్య సంప్రదాయం అనుసరించేవారు. మురీద్​ అంటే విద్యార్థి లేదా శిష్యుడు అని అర్థం. 
  • హక్​, ఖత్క్​: హక్​ అంటే సృష్టికర్త. ఖత్క్​ సృష్టి. 
  • సమ రక్స్​: ఆధ్యాత్మిక సంగీతం. రక్స్​ అంటే నృత్యం (ఆధ్యాత్మిక నృత్యం)
  • ఫన: పరమాత్మలో ఆత్మ విలీనం కావడం.
  • తౌబా, తవక్కుల్: తౌబా అంటే పశ్చాత్తాపం. తవక్కుల్​ అంటే భగవంతునిపై విశ్వాసం.
  • జక్స్: దైవనామ స్మరణ.
  • దర్గా, ఉర్స్​: దర్గా అంటే సూఫీల సమాధులు. ఉర్స్​ అంటే వారి మరణ వారోత్సవాలు. అమరత్​ అంటే దర్గా దర్శనం. 
  • తౌహిద్​ఎ వజూది: అందరూ ఒక్కటే అనే భావన. దీనిని ఇబనత్​ అరబి ప్రారంభించారు. గురు నానక్ నుంచి ప్రభావితమైన సూత్రం ఇది. 
  • ఇన్​ సాన్​– ఇ–కామిల్: సంపూర్ణ మానవుడు అనే సూత్రం. దీనిని హుస్సేన్​ మనాసూర్​ ప్రారంభించారు. 
  • ప్రేమ: మొదటి మహిళా సూఫీ సాధువు 
  • అయిన రబియ ప్రారంభించింది. ఈమె హుస్సేన్​ శిష్యురాలు.