ప్రజలకు ప్యూర్ వాటర్ అందించాలి : కలెక్టర్ హనుమంతు. కే.జెండగే

  • కలెక్టర్ హనుమంతు. కే.జెండగే

యాదగిరిగుట్ట, వెలుగు: గ్రామాల్లోని పైప్ లైన్ రిపేర్లు వెంటనే పూర్తి చేసి ప్రజలకు ప్యూర్ వాటర్ సప్లయ్ చేయాలని యాదాద్రి కలెక్టర్ హనుమంతు. జెండగే సూచించారు. గురువారం ఆలేరు, మోటకొండూర్ మండలాల్లో  ఏర్పాటు చేసిన గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మంచినీటి వ్యవస్థను బలోపేతం చేయడం కోసం  సిబ్బంది కృషి చేయాలన్నారు. వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, లీకేజీలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి, మిషన్ భగీరథ ఎస్ఈ కృష్ణయ్య, ఈఈ కరుణాకర్, ఆలేరు మండల స్పెషలాఫీసర్, ఆలేరు, మోటకొండూర్ మండలాల ఎంపీడీవోలు, మిషన్ భగీరథ ఏఈ పాల్గొన్నారు.