స్కూల్​లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

  • ఒకరు సస్పెండ్, మరొకరికి షోకాజ్ నోటీస్​ జారీ

యాదాద్రి, వెలుగు : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు సీరియస్​ అయ్యారు. ఒకరిని సస్పెండ్ చేయడంతోపాటు మరొకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. భువనగిరిలోని సోషల్​వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్​ను కలెక్టర్​సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్​కు వెళ్లిన వెంటనే ఆయన ముందుగా కిచెన్​కు వెళ్లి వంటలను పరిశీలించారు. కిచెన్, డైనింగ్ హాల్​పరిశుభ్రంగా లేకపోవడంతోపాటు కొత్త మెనూ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

స్టూడెంట్స్​సంఖ్యకు సరిపడా గుడ్లు అందుబాటులో లేకపోవడం గమనించారు. మెనూలో పేర్కొన్నట్టుగా పెరుగు ఇవ్వకుండా స్టూడెంట్స్​కు మజ్జిగ అందించడాన్ని ఆయన పరిశీలించారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహిరంచిన కేర్ టేకర్ రమేశ్​ను సస్పెండ్​చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రిన్సిపాల్ కు జగదీశ్వర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆదివారం కూడా ఇదే స్కూల్​ను కలెక్టర్​ తనిఖీ చేసి ప్రిన్సిపాల్​అందుబాటులో లేకపోవడంతో సీరియస్ అయ్యారు.