హాస్టల్ ను తనిఖీ చేసిన కలెక్టర్​ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు : భువనగిరిలోని సోషల్​వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్​ను యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ హాస్టల్​లో లేకపోవడంతో కలెక్టర్ సీరియస్​అయ్యారు. ఇష్టమొచ్చినట్టు వెళ్తే కుదరదని, అనుమతి తీసుకునే వెళ్లాలని ఆదేశించారు. అనంతరం కిచెన్​లోకి అడుగుపెట్టిన ఆయన వంట కోసం తెచ్చిన సరుకులు, గుడ్లు, కూరగాయలను పరిశీలించారు. బియ్యం, చింతపండును పరిశీలించి నాణ్యతగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రమైన వాతావారణంలో వంట చేయాలని సూచించారు. 

అనంతరం 8వ తరగతి స్టూడెంట్స్​వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. మ్యాథ్స్​లోని ప్రాబ్లమ్స్​ గురించి బ్లాక్​బోర్డుపై రాసి వివరించారు. ఫండ్స్​ కొరత కారణంగా డార్మెటరీ హాల్​నిర్మాణం నిలిచిపోయిందని తెలుసుకొని సాంఘిక సంక్షేమ గురుకుల సెక్రటరీ  వర్షిణితో ఫోన్​లో మాట్లాడి పరిస్థితి వివరించారు. ఫండ్స్ మంజూరు చేయాలని కలెక్టర్​కోరారు. అనంతరం సోమవారం నుంచి ప్రారంభమయ్యే సీఎం కప్ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.