Redmi A4 5G: గుడ్న్యూస్..రూ.8వేలకే 5G స్మార్ట్ ఫోన్

తక్కువ ధరలో 5G స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..ఫాస్ట్ ఛార్జింగ్, మల్టీ టాస్కింగ్ తో ఫాస్ట్ గా రన్ అయ్యే స్మార్ట్ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ లో వేగంగా రన్ అయ్యే స్మార్ట్ ఫోన్ Redmi A4 5G వస్తోంది. ప్రముఖ సెల్ ఫోన్ తయారీ సంస్థ Xiaomi  కంపెనీ భారత్ లో 10వేల లోపు మొదటి 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది.  

కొత్త Snapdragon 4s Gen 2 చిప్ సెట్ తో ఈ కొత్త 5G స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ పనిచేస్తుంది. ఈ హార్డ్ వేర్ మార్కెట్లో తొలిసారి వచ్చింది. ఖచ్చతమైన ధర ప్రకటించనప్ప టికీ రూ.8వేల లోపు ఉంటుందని తెలుస్తోంది. 

ALSO READ : Intel: ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా..ఉద్యోగులకు ఉచిత కాఫీ, టీలు..ఎందుకో తెలుసా

Xiaomi స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు వెల్లడించలేదు. అయితే Snapdragon 4s Gen2 చిప్ సెట్ సపోర్టు చేసే ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునేలా చేస్తుంది. కొత్త 5G చిప్ సెట్  పూర్తి HD+ రిజెల్యూషన్ అందించనుంది. 90Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ కు సపోర్టు చేస్తుంది. ఈ చిప్ సెట్ 8GB RAM, UFS3.1కి సపోర్టు చేయడం ద్వారా యాప్ ల వేగంగా పనిచేస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో మల్టీ టాస్కింగ్ ఈజీగా ఉంటుంది. 
ఛార్జింగ్ విషయానికి వస్తే.. 40W  చార్జర్ ద్వారా వేగంగా ఛార్జింగ్ అందించగలదు. ఇది బడ్జెట్ ఫోన్లతో పోల్చినపుడు వేగవంంతమైన ఛార్జింగ్ సపోర్టు ఇది.