తైవాన్‌‌పై యుద్ధానికి సిద్ధంగా ఉండండి...చైనా దళాలకు జిన్‌‌పింగ్‌‌ ఆదేశం 

బీజింగ్‌‌:  తైవాన్ విషయంలో చైనా మరోసారి  బెదిరింపు ధోరణిని ప్రదర్శించింది. తైవాన్ తమ దేశంలో భాగమేనని చెప్పుకుంటూ వస్తున్న చైనా ఎప్పటికప్పుడు సైనిక విన్యాసాలతో ఉద్రిక్తతలను పెంచుతున్నది. తాజాగా తైవాన్ పై యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ చైనా బలగాలను ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఆదేశించారని చైనీస్ మీడియా  వెల్లడించింది.

గత గురువారం పీపుల్స్‌‌ లిబరేషన్‌‌ ఆర్మీ రాకెట్‌‌ ఫోర్స్‌‌కు చెందిన బ్రిగేడ్‌‌ను సందర్శించిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపింది. కాగా, గత సోమవారం తైవాన్‌‌ను చుట్టుముట్టడానికి ఫైటర్‌‌‌‌ జెట్‌‌లు, డ్రోన్స్‌‌, యుద్ధనౌకలను చైనా మోహరించింది. తైవాన్ చుట్టూ సముద్ర జలాల్లో డ్రాగన్ కంట్రీ సైనిక విన్యాసాలను కూడా చేపట్టింది.