గూగుల్ పేలో డబ్బులు పోయాయా? ఇలా చేస్తే మీ డబ్బులు మీకు వస్తాయ్..

డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. రోడ్డుపైన పడిపోయిన డబ్బులు తిరిగి వస్తాయో లేదో.. చెప్పలేము కానీ. రాంగ్ నెంబర్ కారణంగా గూగుల్ పేలో ఒకరికి బదులు మరొకరికి సెడ్ చేసిన మనీ మాత్రం ఎక్కడికి పోవు. మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా సరే మీ డబ్బులు మీ ఖాతాలోకి వచ్చి చేరుతాయి. నెట్ వర్క్ సరిగా లేక కొన్ని సార్లు పేమెంట్ ఫెయిల్ కూడా అవుతుంది. చాలామంది ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పొరపాటున మరో వ్యక్తికి డబ్బు పంపిస్తారు. అతనికి కాల్ చేస్తేనేమో రెస్‌పాండ్ అవ్వడు. నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాడు. ఆశలన్నీ ఒదులుకొని పైసలు పోగొట్టుకుంటారు చాలామంది. అయితే అలా రాంగ్ నెంబర్ కు కొట్టిన డబ్బులు గూగుల్ పే సపోర్ట్ టీంకి కాంటాక్ట్ అయి రీఫండ్ రిక్వెస్ట్ పెట్టుకుంటే.. మళ్లీ మీ అకౌంట్లోకి జమ అవుతాయి. గూగుల్ పేలో రీఫండ్ రిక్వస్ట్ ఎలా పెట్టాలో ఇప్పడు చూద్దాం..

ALSO READ : ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ లాభం రూ. 7 వేల 621 కోట్లు

గూగుల్ పే సపోర్ట్ టీం సంప్రదింపులు

  • గూగుల్ పే సపోర్ట్ టీంను సంప్రదించడానికి 1800 419 0157నెంబర్  కు కాల్ చేయాలి.
  • తర్వాత రీజనల్ ల్యాగ్వేజ్ సెలక్ట్ చేసుకోవాలి.
  • గూగుల్ పే సపోర్ట్ హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది.
  • ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ ఐడీ నెంబర్ వివరాలు చెప్తే  3 లేదా 4 వర్కింగ్ డేస్ లో మీ డబ్బులు మీ అకౌంట్లో వచ్చి చేరుతాయ్.