- బ్యాంకర్లకు కేరళ సీఎం విజ్ఞప్తి
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిన పడిన ఘటనలో సర్వం కోల్పోయిన బాధితుల లోన్లను పూర్తిగా రైటాఫ్ చేయాలని బ్యాంకర్లకు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరువనంతపురంలో జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వం కోల్పోయి బాధితులుగా మారిన వారి అకౌంట్ల నుంచి బ్యాంకులు నెలవారీ ఈఎంఐలను కట్ చేసుకోవడం సరికాదన్నారు.
‘‘విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడిన నిరాశ్రయులయ్యారు. ఇటు ఇండ్లు కట్టుకునేందుకు, అటు వ్యవసాయం చేసుకునేందుకు కూడా భూమి అనుకూలంగా లేకుండా మారిపోయింది. అందుకే బాధితుల లోన్లను పూర్తిగా రైటాఫ్ చేయాలి. దీని వల్ల బ్యాంకులకు భరించలేనంత
నష్టమేమీ జరగదు” అని ఆయన చెప్పారు.