ఆకట్టుకున్న  కుస్తీ పోటీలు

బీర్కూర్​, వెలుగు : బీర్కూర్​ మండల కేంద్రంలో గజ్జెలమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి.  ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన కుస్తీ వీరులు పోటీలో పాల్గొనడంతో పోటీలు హోరాహోరీగా సాగాయి.  

గెలుపొందిన కుస్తీ వీరులకు గ్రామ పెద్దలు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం గ్రామంలో ఎడ్లబండ్ల ఉరేగింపు నిర్వహించారు.