ప్రపంచంలో తొలి రాబందుల కన్జర్వేషన్​, బ్రీడింగ్​ సెంటర్​

ఉత్తరప్రదేశ్​ మహారాజ్​గంజ్​లో ఆసియన్​ కింగ్​ వల్చర్​(రాబందుల) జాతుల జనాభాను మెరుగుపరచడానికి ప్రపంచంలోనే తొలి సంరక్ష, సంతానోత్పత్తి కేంద్రాన్ని యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి జటాయు కన్జర్వేషన్​ అండ్​ బ్రీడింగ్​ సెంటర్​ అని పేరు పెట్టారు. ఇక్కడ రాబందులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఈ కేంద్రంలో ఒక శాస్త్రీయ అధికారితోపాటు జీవ శాస్త్రవేత్త ఉంటారు. భారతదేశంలో కనుగొన్న తొమ్మిది రాబందుల్లో ఇదీ ఒకటి. దీనిని ఆసియన్​ కింగ్​ వల్చర్​ లేదా పాండిచ్చేరి వల్చర్​(రాబందు) అని కూడా పిలుస్తారు. ఆసియన్​ కింగ్​ వల్చర్​ను రెడ్​ హెడ్​ వల్చర్​ అని కూడా పిలుస్తారు. 

​ 
అంతరించిపోవడానికి కారణాలు

  •  తమ ఆవాసాలను కోల్పోవడం
  •  పెంపుడు జంతువుల్లో డైక్లోఫెనాక్​ అనే నాన్​స్టెరాయిడ్​ యాంటీ ఇన్​ఫ్లమేటరీ డ్రగ్​ను అధికంగా ఉపయోగించడం. 

పరిరక్షణ స్థితి

ఇంటర్నేషనల్​ యూనియన్​ ఫర్​ కన్జర్వేషన్​ ఆఫ్​ నేచర్​ 2007లో రెడ్​ లిస్ట్​లో తీవ్రమైన అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఆసియన్​ కింగ్​ వల్చర్​ను చేర్చారు.