World Population: 800 కోట్లకు ప్రపంచ జనాభా!.. కొత్త సంవత్సరంలో జరగబోతోంది?

మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం..ఎన్నో సమస్యలు, సవాళ్లతో 2025కి వెల్​ కమ్​ చెప్పబోతున్నాం. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లలో జనాభా ఒకటి. ప్రపంచ జనాభా నానాటికి పెరిగిపోతోంది. జనాభా పెరుగుదలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. నియంత్రణ చర్యలు చేపట్టాయి.. అధిక జనాభా నియంత్రణకు  ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థ కూడా దిద్దుబాటు చర్యలు సూచిస్తోంది. 

ప్రపంప జనాభా పెరుగుదలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. 2024లో ప్రపంచ జనాభా 7.10 కోట్లు పెరిగిందని  కొత్త యేడాదిలో 800 కోట్ల మార్క్​ దాటుందని US సెన్సస్ బ్యూరో అంచనా రిపోర్టును సోమవారం విడుదల చేసింది. 2025 జనవరిలో ప్రతి సెకండ్కు 4.2 జననాలు, 2.0 మరణాలు ఉంటాయని అంచనా వేసింది. 

ALSO READ | ఇక నాశనం చేసింది చాలు.. పొల్యూషన్ తగ్గించడానికి మనకు తెలియకుండా ఇంత జరుగుతుందా..?

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో భారత్​ మొదటి స్థానంలో ఉంది. మరోవైపు 2024లో అమెరికా జనాభా 2.6 మిలియన్లకు పెరిగిందని రిపోర్టులు చెబుతున్నాయి. సెన్సెస్ బ్యూరో అంచనా ప్రకారం..కొత్త సంవత్సరంలో 34కోట్లకు (340మిలియన్లకు) చేరుతుందట. ప్రతి 9 సెకండ్లకు ఒక జననం, 9.4 సెకన్లకు ఒక మరణం సంభవిస్తాయని అంచనా వేసింది. 

అంతర్జాతీయ వలసలతో  ప్రతి 23.2 సెకన్లకు US జనాభాలో ఒక వ్యక్తిని చేరుతాడని  అంచనా వేయబడింది. జననాలు, మరణాలు , నికర అంతర్జాతీయ వలసల కలయిక వలన US జనాభా ప్రతి 21.2 సెకన్లకు ఒక వ్యక్తికి పెరుగుతుందని సెన్సస్ బ్యూరో తెలిపింది.

ఇప్పటివరకు 2020లలో US జనాభా దాదాపు 9.7 మిలియన్ల మంది పెరిగింది. ఇది 2.9 శాతం వృద్ధి రేటు. 2010లలో US 7.4 శాతం వృద్ధి చెందింది. ఇది 1930ల తర్వాత అతి తక్కువ రేటు.  అయితే ప్రపచం జనాభా ఏడాదితో దాదాపు7 కోట్లు పెరిగినప్పటికీ 2023తో పోలిస్తే..0.9 శాతం తగ్గిందట. 

కొత్త సంవత్సరంలో ఏం జరగబోతోంది.. 

2025లో ప్రపంచ జనాభా 800 కోట్ల మార్క్​ ను దాటుతుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నప్పటికీ జనాభా పెరుగుదల కొనసాగుతోంది.భవిష్యత్తులో ప్రపంచ జనాభా 10.3 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. 

2024లో భారతదేశంలో జనాభా పెరుగుదల గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో కొనసాగుతోంది. జనాభా పెరుగుదల ఆహారం, నీరు, ఇంధనం వంటి వనరుల కొరత, ఉపాధి అవకాశాలు తగ్గడం, పేదరికం పెరిగే ప్రమాదం, పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలతో పాటు గృహనిర్మాణం, రవాణా వంటి సామాజిక సమస్యలు తీవ్రతరం అయ్యే ప్రమాదంపై ఆందోళన, పరిష్కార మార్గాల అవసరాన్ని నొక్కి చెపుతున్నాయి.