సోమవారం ( మార్చి4) ప్రపంచ ఉబకాయ దినోత్సవం.. వరల్డ్ ఒబిసిటీ డే.. స్థూలకాయం, దుష్పలితాలు,వాటి నివారణ, ఒబిసిటీకి అందుబాటులో ఉన్న వైద్య విధానాలు వంటి విషయాలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రపంచ వ్యాప్తంగా స్థూలకా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఊబకాయం అంటే కొవ్వురూపంతో పెరిగే అధిక బరువు. దీంతో గుండె జబ్బులు, బ్లడ్ ప్రెషర్, తీవ్రమైన అర్థటైటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకారం.. 25 లేదా అంతకంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అధిక బరువుగాను, బీఎంఐ 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఊబకాయంగా ను పరిగణించబడుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా జనాభాలో మూడింట ఒక వంతు మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరికి , ప్రతి ముగ్గురు పెద్దల్లో ఒకరికంటే ఎక్కవ మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. హైపర్ టెన్సన్, డయాబటిస్, ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్, ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్, గాల్ స్టోన్స్, ఎసిడిటీ, స్ట్రోక్, క్యాన్సర్లు, బోలు ఎముకల వ్యాధి వంటి అనేక అనారోగ్యసమస్యలు ఈ ఊబకాయంతో ముడిపడి ఉన్నాయి.
ఊబకాయ దినోత్సవ తేది: ప్రతి యేటా మార్చి 4న ప్రపంచ ఒబిసిటి దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఊబకాయ దినోత్సవ చరిత్ర
ప్రపంచ ఒబిసిటీ ఫెడరేషన్ తన గ్లోబల్ సభ్యుల సహకారంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఆరోగ్యకరమైన బరువు సాధించడం, మెయిన్ టెన్ చేయడంలో ప్రజలకు సహాయ పడే ఆచరణాత్మక చర్యలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 2015 లో మొదటి సారి వార్షిక ప్రచారం నిర్వహించారు.