History : జనవరి 2.. ఏం రోజో మీకు తెలుసా.. బిల్ గేట్స్, జుకర్ బర్గ్ ఈ కేటగిరీ వ్యక్తులే.. ఇందులో మీరు ఉన్నారా..?

థర్టీ ఫస్ట్ నైట్ పార్టీ అయిపోయింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. రెండో రోజు కూడా వచ్చేసింది. అప్పుడే వీటి మధ్యలో కొత్తగా ఇంకేం కొత్తది ఉంటుంది?  అనుకునే వాళ్లకోసమే ఇది. జనవరి 2న 'వరల్డ్ ఇంట్రావర్ట్స్ డే ఉంది. మీ మధ్యలో ఉండొచ్చు ఇంట్రావర్ట్.. లేదా మీరే కావొచ్చు!

జనాలతో కన్నా తమతో తామే ఎక్కువ సమయం గడపడం ఇష్టపడే వాళ్లను ఇంట్రావర్ట్స్ అంటారు. అంతర్ముఖులు వాళ్లు. వాళ్లకేం కావాలో అది చూసుకుంటూ, నచ్చిన పని చేసుకుంటూ వాళ్ల గోలలో వాళ్లు ఉంటారు. పెద్దగా మాట్లాడరు. ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోవడం వాళ్లకు ఇష్టం. మన జనాభాలో 40 నుంచి 50 శాతం మంది ఇంట్రావర్ట్సే!

ఇంట్రావర్ట్స్ అంటే సిగ్గుతో బయటకు రాకుండా దాచుకునేవాళ్లనుకుంటారు చాలామంది. కాకపోతే ఇంట్రావర్ట్స్ చాలా తెలివైనవాళ్లు. బాగా మాట్లాడగలిగిన వాళ్లూ ఉంటారు. కాకపోతే వాళ్లకు అందరితో కలిసిపోయి మాట్లాడటం పెద్దగా ఇష్టం ఉండదు. ఏదో చదువుకుంటూ.. వాళ్ల గురించి వాళ్లు ఆలోచించుకుంటూ బతికేస్తారు. ఇంట్రావర్ట్కు అపోజిట్ ఎక్స్ట్రాట్రావర్ట్స్. కొత్తవాళ్లతో చలాకీగా, చాలా ఈజీగా కలిసిపోతారు వీళ్లు. అయితే నిజానికి పూర్తిగా ఇంట్రావర్ట్స్ కానీ, పూర్తిగా ఎక్స్ట్రావర్ట్స్ కానీ ఉండరు.

Also Read:- ఇండియాస్ రిచెస్ట్ ఫిమేల్ సింగర్ ఎవరో తెలుసా?

రెండింటి మధ్యలోనో, ఒకదానికి కాస్త దగ్గరగానో ఉంటారంతే. ఇంట్రావర్ట్స్ ఎవరంటే... ఎక్కువ మందితో కలిసి ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉండటం. ఒకరితో మాట్లాడటం కంటే తమలో తామే మాట్లాడుకోవడాన్ని ఇష్టపడటం. చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండటం. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడన్న పేరుండటం. 

మైక్రోసాఫ్ట్ సృష్టి కర్త, ఫేస్ బుక్ సృష్టి కర్తలు అయిన బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్ సైతం ఇంట్రావర్ట్స్ అంట.. ప్రపంచ వ్యాప్తంగా సృష్టికర్తల్లో 50 శాతం మంది ఈ కేటగిరీ కిందకే వస్తారంట.. వీళ్లు ఎప్పుడూ సమాజాన్ని చూస్తూ.. అవగాహన చేస్తూ కొత్త ప్రయోగాలను సృష్టిస్తుంటారంట.. ఇలాంటి ఇంట్రావర్ట్స్ సృష్టించినవే మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్. 
ఇవన్నీ ఇంట్రావర్ట్ జీవితంలో జరిగేవే! మీరూ ఇంట్రావర్ట్ అయితే ఇవ్వాళ డే మీదే!!