గుడ్‌న్యూస్.. లంగ్ క్యాన్సర్‌కు వాక్సిన్ ప్రపంచంలోనే ఫస్ట్ టైం లండన్‌లో ట్రయిల్స్

ఎంతో మంది ప్రాణాలను బలితీసుకున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ప్రపంచంలో తొలిసారిగా వ్యాక్సిన్ కనుగొన్నారు. సెప్టెంబర్ 23న లండన్ లోని 67 ఏళ్ల జానస్జ్ రాక్జ్ అనే రోగికి ట్రయిల్స్ లో భాగంగా ఆరు సిరంజిల వ్యాక్సిన్‌ ఇచ్చారు. మొట్టమొదటి సారిగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాక్సిన్‌ ట్రయల్ చేసి, డాక్టర్లు రిజల్ట్స్ పరిశీలిస్తున్నారు. ప్రతీయేట 1.8 మిలియన్ల మంది లంగ్ క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారు. BNT116 పేరుతో వ్యాక్సిన్‌ యూనైటెడ్ కింగ్ డమ్ శాస్త్రవేత్తు ప్రయోగాలు జరుపుతున్నారు. 

ప్రతి వ్యాక్సిన్‌ క్యాన్సర్ కణితుల విభిన్న భాగానికి సంబంధించిన జన్యు పదార్థాన్ని కలిగి ఉంది. రోగి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలోని ఐదు బిలియన్ కణాలపై దాడి చేసే సామర్థ్యం ఈ వ్యాక్సిన్లకు ఉంది. ఈ వ్యాక్సిన్‌ను బయోఎన్‌టెక్ కంపెనీ తయారు చేసింది. వ్యాధి అత్యంత సాధారణ రూపమైన నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ చికిత్సకు BNT116 వ్యాక్సిన్ ప్రయోగించారు. జానస్జ్ రాక్జ్ ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న మొదటి వ్యక్తి. BioNTech, జర్మన్ బయోటెక్నాలజీ సంస్థ, ఈ mRNA ఆధారిత వ్యాక్సిన్‌ని BNT116గా అభివృద్ది చేసింది. 

Also Read:-ఐడెంటిటీ చెక్ చేసి 23 మందిని కాల్చి చంపిన టెర్రరిస్టులు

వ్యాక్సిన్ రోగనిరోధక వ్యవస్థను సక్రియం చేయడం ద్వారా పనిచేస్తుంది. ఇది క్యాన్సర్ కణాలను గుర్తించి, పోరాడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సను పరిశోధించడానికి మేము ఇప్పుడు mRNA ఆధారిత ఇమ్యునోథెరపీ క్లినికల్ ట్రయల్స్ యొక్క ఈ ఉత్తేజకరమైన కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నాము" అని జాతీయ అధ్యయనానికి నాయకత్వం వహిస్తున్న యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్స్ (UCLH) కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ సియో మింగ్ లీ అన్నారు.