ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం

టెక్సాస్​కు చెందిన రెయిన్​ ఫారెస్ట్​ పార్టనర్షిప్​ అనే లాభాపేక్ష లేని పర్యావరణ సంస్థ 2017లో వర్షారణ్యాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి ప్రపంచ రెయిన్​ ఫారెస్ట్​ డేను ప్రతి సంవత్సరం జూన్ 22న నిర్వహించాలని నిర్ణయించింది. ఈ దినోత్సవాన్ని యునైటెడ్​ నేషన్స్​ ఎకనామిక్​ అండ్​ సోషల్​ కౌన్సిల్​(యూఎన్​ఈసీ) కూడా ఆమోదించిది. 

2024 థీమ్ ​: ద ఇయర్​ ఆఫ్​ యాక్షన్​

  •     భవిష్యత్తు తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించడం
  •     పర్యావరణ సమతుల్యత, భూగోళాన్ని సంరక్షించడంలో వర్షారణ్యాలు పోషించే కీలక పాత్ర గురించి ప్రపంచ మానవాళికి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. 

వర్షారణ్యాల ప్రాముఖ్యత

  •     వర్షారణ్యాలు భూమికి ఊపరితిత్తులు అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి కార్బన్​ డై ఆక్సైడ్​ను శోషించుకుని గ్లోబల్​ వార్మింగ్​ను తగ్గించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. 
  •     వర్షారణ్యాలు ప్రపంచంలోని 50 శాతం మొక్కలు, జంతు జాతులను కలిగి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళికి అవసరమైన వనరులను అందిస్తున్నాయి.
  •     ప్రపంచ కార్బన్ ఉద్గారాల్లో 30 శాతం శోషించడం ద్వారా భూవాతావరణాన్ని నియంత్రించడంలో వర్షారణ్యాలు కీలకపాత్ర పోషిస్తాయి.