Women Employees: బిఫోర్​ డెలివరీ.. ఆఫ్టర్​ డెలివరీ.. బ్యాలెన్సింగ్​ డ్యూటీ ఎలా..

హైటెక్​ యుగంలో ఖర్చులు భారీగా పెరిగిపోయాయి.  ఇంట్లో  భార్యాభర్తలు ఇద్దరు కలిసి పని చేస్తే కాని.. కుటుంబం గడవని పరిస్థితి. అయితే వివాహం.. పిల్లలు  లైఫ్​ స్టైల్లో కామన్​.... ఎంప్లాయిడ్​ ఉమెన్స్​ డెలివరీకి ముందు ఉండే యాక్టివ్​ వర్క్​.. ఆఫ్టర్​ డెలివరీ చేయలేకపోతారు.  డెలివరీ తర్వాత ఆఫీసుల్లో మునుపటిలా ఉండలేరు. కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా చేసుకుంటే ఇలాంటి సమస్యలు రావంటున్నారు నిపుణులు. వారి సూచనల ప్రకారం డెలివరీ అయిన మహిళా ఉద్యోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. . .

ఈ రోజుల్లో బయటికి వెళ్లి ఉద్యోగం చేయడానికి అమ్మాయిలు. ఎవరూ భయపడట్లేదు. ఆ విషయంలో ఇంట్లో వాళ్లు, సొసైటీ కూడా ప్రోత్సహిస్తోంది. అయితే పెళ్లికానంత వరకూ ఇదంతా ఓకే... మరి తర్వాత? పెళ్లయ్యాక ఉద్యోగాలు మానేస్తున్న వాళ్లున్నారు... కంటిన్యూ చేస్తున్నవాళ్లూ ఉన్నారు. ఇప్పటివరకూ అంతా బాగానే ఉంది. కానీ ఒక్కసారి ప్రెగ్నెంట్ అయ్యాక... బిడ్డ పుట్టాక ఎంతమంది జాబ్ చేస్తున్నారన్నదే ముఖ్యం. పిల్లలతో గడపాలని కొందరు... ఇంట్లో చూసుకునే వాళ్లు లేక ఇంకొందరు..... ఇలా చాలాకారణాల వల్ల తల్లులు ఉద్యోగంలో చేరట్లేదు. కొంతమంది తల్లులు మాత్రం ఉద్యోగంలో చేరినా.... ఇంతకు ముందులా హుషారుగా పని చేయలేకున్నారు.

బ్యాలెన్సింగ్ డ్యూటీ

మెటర్నిటీ లీవ్​కి ముందు వరకు మహిళలు  ఆఫీస్ లో చాలా యాక్టివ్​గా ఉంటారు. కొంతమంది వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి డెలివరీకి వెళ్లే ముందురోజు వరకు... కొలీగ్స్ తోహ్యాపీ హ్యాపీగా గడుపుతారు.  డెలివరీ అయ్యి తిరిగొచ్చాక...  చాలా మార్పులు వచ్చాయి. ఆఫీసుకు చాలా డల్​గా వస్తూ... ఎంతసేపూ ఆరు నెలల బాబు గురించే ఆలోచిస్తుంటారు. 

ALSO READ | Health Tips: లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ను ఇలా తగ్గించుకోండి..

సహోద్యోగులు ఏమైందని అడిగితే.. ఇంట్లో బాబుని చూసుకోవడానికి ఎవరూ లేరు. దాంతో కేర్ సెంటర్ లో వేసొచ్చా. అక్కడ ఎలా ఉంటున్నాడోనని దిగులుగా ఉంది. వాడికి టైమ్ పాలు పడుతున్నారో లేదోనని కంగారు పడుతూ ఆందోళనకు గురవుతుంటారు. . ఈ స్ట్రెస్ వల్ల డిప్రెస్ అవుతున్నా... అందుకే ఏం చేయాలో తెలియక అర్దంకాని పరిస్థితిలో ఉంటారు. ఇలా కొలీగ్స్​ తో బాధనంత చెప్పుకుంటారు.  ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో డెలివరీ తర్వాత ఆఫీసుల్లో మునుపటిలా ఉండలేరు. కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా చేసుకుంటే ఇలాంటి సమస్యలు రావంటున్నారు నిపుణులు. 

పాలవిషయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలు

ఏడాది వయసు వచ్చే వరకు పిల్లలకు తల్లిపాలు ఎంతో ముఖ్యం.  అయితే ఆఫీసులకు వెళ్లాలనుకునే తల్లులు ఆ విషయం గురించి  ఆలోచించాలి.  కొందరి తల్లులకు పాలు సరిగా రావు... అంటి వాళ్లు మొదటినుంచే పిల్లలకు ఫార్ములా పాలు పడతారు.  కాబట్టి సమస్య ఉండదు.  కొని కొంతమందికి పాలు బాగా పడతాయి. అలాంటి వాళ్లు ఉద్యోగాలకు వెళ్లాలనుకుంటే.. పాలను పంప్ సాయంతో పిండి గాజు సీసాల్లో పోసి... ఫ్రిజ్లో స్టోర్ చేయొచ్చు. దాన్ని నాలుగైదు గంటలలోపు పిల్లలకు పట్టాలి. లేదంటే పిల్లలకు మెల్లిమెల్లిగా ఫార్ములా అలవాటు చేయడం మంచిది. ఈ విధంగా పాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే...ఆఫీసుల్లో నిశ్చింతగా ఉండొచ్చు. కేవలం పాలు మాత్రమే కాకుండా ఆరునెలలు దాటిన పిల్లలకు.. ఇంట్లో తయారు చేసిన ఉగ్గు తినిపించాలి.

పిల్లలను ఎవరి దగ్గర ఉంచాలి...

ఆఫీసులో రీజాయిన్ కావడానికి రెండు వారాల ముందే పిల్లల సంరక్షణ ఎవరికి అప్పజెప్పాలనే విషయాన్ని ఆలోచించాలి. అది అమ్మమ్మనా.... నాన్నమ్మగా... మరెవరైనా కుటుంబ సభ్యులా అన్న దాంట్లో క్లారిటీ తెచ్చుకోవాలి. లేదంటే ఆఫీసుకు వెళ్లేటప్పుడు కంగారు పెరుగుతుంది. ఎవరైతే ఓపికగా, ప్రేమగా పిల్లలను కంటికిరెప్పలా చూసుకోగలరో వాళ్ల దగ్గర పెట్టడం ముఖ్యం. అలాగే తల్లులు  కూడా ఆఫీసులో ఉంటూ పిల్లలు గార్డియన్లను గైడ్ చేయాలి. ఏ టైమ్ కి ఏం ఇవ్వాలో కొన్నిరోజుల వరకు చెప్తూ ఉంచాలి. మొదట్లో పర్మిషన్లు తీసుకుని ఆఫీసు నుంచి ఇంటికి త్వరగా రావడం వల్ల పిల్లలకూ మెల్లిగా అలవాటు అవుతుంది.

సపోర్ట్ గ్రూప్స్ ఉండాలి

ఫ్రెండ్స్ తో మాట్లాడటం ఎప్పుడూ మంచి థెరపీగా పని చేస్తుంది. కొత్త తల్లులైతే.. అప్పటికి ఆఫీసులో ఉన్న తల్లులతో చర్చించొచ్చు. వాళ్ల అనుభవాలు, పిల్లల సంరక్షణకు సంబంధించిన విషయాలో సలహాలు తీసుకోవాలి.  అలాంటి ఫ్రెండ్లీ సర్కిల్ ఉన్నప్పుడు... పిల్లలకు దూరంగా ఉన్న బాధ తగ్గుతుంది. అప్పుడే ఆఫీసులో హాయిగా పని చేసుకోవచ్చు. ఇప్పుడు అందరి. దగ్గరా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి... ఇంట్లో ఉన్న గార్డియన్​ కు వీడియో కాల్ చేసి పిల్లలను చూడొచ్చు దాంతో తల్లికి చాలా రిలీఫ్ గా ఉంటుంది.

వర్క్ ప్లేస్ సాయం

ఇంట్లో పిల్లలు.. ఆఫీసులో పని.. ఇలా రెండింటి మధ్య చాలామంది. కొత్త తల్లులు సతమతమవుతారు. కానీ ఒక పసిబిడ్డ తల్లి అనగానే.. ఆమె మీద ఎవరికైనా కన్సర్న్ ఉంటుంది. ఆఫీసులో బాస్​,  కొలీగ్స్ తో కొన్ని విషయాలను చర్చించాలి. టైమింగ్స్, షిప్ట్స్​  విషయంలో సాయం కావాలని అడగాలి. అంతేకాదు. ఆఫీసు దగ్గర్లోనే ఏదైనా డే కేర్ సెంటర్ ఉంటే అందులో చేర్పించడం మంచిది. మహిళలు ఒకప్పటి కంటే.. పిల్లలు. పుట్టాక ఎక్కువ మెచ్యూర్డ్, బ్యాలెన్స్​గా ఉద్యోగ బాధ్యతలను నిర్వహించవచ్చని ఎన్నో స్టడీస్​ చెప్తున్నాయి.