ఓపెన్ గా ఉండండి బాస్

సమస్య చుట్టుముట్టని మనిషి అంటూ ఉండడు. కొందరు కష్టంతో దానిని అధిగమిస్తారు. ఇంకొందరు ఇతరులతో చెప్పుకుని ఊరట పొందుతుంటారు. మరికొందరు ఎవరికీ చెప్పుకోలేక రందితో బాధపడుతారు. అయితే ప్రశాంతంగా జీవించాలంటే మాత్రం ఆ భారాన్ని దించుకోవాల్సిందే. ముఖ్యంగా ఆఫీసుల్లో పని చేసే వాళ్లకు అది తప్పనిసరని మానసిక నిపుణులు చెప్తున్నారు.

పనిచేసేచోట నలుగురితో కలిసి భోజనం పంచుకుంటాం.కొంత మందితో కష్ట సుఖాలను పంచుకుంటాం... అయితే, ఆరోగ్య సమస్యల గురించి చర్చించుకున్నా ఆనందంగా జీవించొచ్చు. ఈ విషయాన్ని శాస్త్రీయంగా కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. సెక్సువల్ ఓరియెంటేషన్ (లైంగిక ధోరణి), హెల్త్ సమస్యలను తోటి ఉద్యోగులతో చెప్పుకోవడం వల్ల పని ఒత్తిడి తగ్గుతుంది. హాయిగా కమిట్ మెంట్ తో పని చేసుకోగలుగుతారు. పైగా ఈ ప్రవర్తన మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. జీవితంలో సంతృప్తి మిగులుతుంది.మొత్తానికి మనిషి సంతోషంముడిపడి ఉండేది మానసిక ఆరోగ్యంతోనే. కాబట్టి ఆరోగ్య సమస్యలను లోపలే దాచుకోవడం అస్సలు మంచిదికాదు. ఇందులో సిగ్గు పడాల్సిన పని లేదు.

చూజ్ రైట్ పర్సన్ 

సెల్ఫ్ డిస్ క్లోజర్.. అంటే మీకు సంబంధించిన విషయాలను ఎవరో ఇతరులకు చెప్పడం కాదు. మీ అంతట మీరే మీ గురించి చెప్పుకోవడం. భావాలు, గోల్స్, ఫెయిల్యూర్స్, సక్సెస్, భయాలు, కలలు, ఇష్టాలు, నచ్చనివి, నచ్చినవి.. ఇలా ఏదైనా కావొచ్చు. ఈ విషయాలను షేర్ చేసుకునేందుకు ఒక మంచి వ్యక్తి అవసరం.

సాధారణంగా వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకునేందుకు పార్ట్నర్ (భాగస్వామి) ని మించిన ఆప్షన్ ఉండదు. అయితే కొండరు కొన్ని విషయాలను భాగస్వామితో కూడా షేర్ చేసుకునేందుకు మొహమాటపడుతుంటారు. అలాంటప్పుడు ఆ ఒత్తిడి పనిపై పదుతుంది. అందుకే.. పని చేసే వాళ్లతో ఆ విషయాల్ని షేర్ చేసుకోవడం ఉత్తమం. అయితే ఎవరితో పడితే వాళ్లతో కాకుండా నమ్మదగిన వ్యక్తులతో ఆ విషయాలను పంచుకుంటే మంచిది. ఆఫీస్లో గ్రూప్ వాతావరణం కామన్ కాబట్టి ఆ బృందంతో డిస్కషన్ చేసినా ఫర్వాలేదు.

వీళ్లకు వర్కవుట్ కాదు

పైకి కనిపించని రుగ్మతల గురించి తెలుసుకోవడంలోనే ఇతరులు ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటారు. కంటికి కనిపించే రుగ్మతల విషయంలో ఆసక్తి చూపించరు. ఉదాహరణకు శారీరక వైకల్యం, జాతి, లింగ వివక్ష. అలాంటి రుగ్మతలతో బాధపడేవాళ్లు ఎదుటివాళ్లకు తమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ విషయాలు ఇతరుల్లో అంత ఆసక్తిని కలిగించవు. పైగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

ALSO READ :- మీరు చాలా గ్రేట్: యూట్యూబర్ కాళ్లు మొక్కిన మోదీ