ట్రెండ్​ మారింది.. బంగారు ఆభరణాలకు కొత్త క్రేజ్​

ఆడవాళ్లకు జువెలరీ అంటే ఎంతిష్టమో   ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గోల్డ్ ఆర్టిఫిషియల్.. ఏ నగలైనా సరే నచ్చితే చాలు కొనేస్తుంటారు. అందులోనూ ఈ మధ్య 'పర్సనలైజ్డ్ జువెలరీ' ట్రెండ్​ గా  మారింది. ఎవరికి నచ్చినట్టు వాళ్లు నగలను డిజైన్ చేయించుకుంటున్నారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలు, జాబ్ చేసేవాళ్లు స్టైలిష్ గా కనిపించేందుకు ఇలాంటి జువెలరీ ఎక్కువగా వాడుతున్నారు. వాటిలో నేమ్ పెండెంట్స్, ఫింగర్ రింగ్స్ పై నేమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

స్పెషల్​ గా ....

ఈ కాలంవాళ్లు ముఖ్యంగా గిఫ్ట్స్​ ఇచ్చేందుకు నేమ్ పెండెంట్స్, రింగ్స్ ఎంచుకుంటున్నారు. జువెలరీ షోరూమ్​లలో ఆర్డర్​ పై  నగలుచేయించుకోవడం తెలిసిందే. అయితే.. అదే తరహాలో లెటర్స్​ తో , నేమ్స్ తో  చైన్స్ కస్టమైజ్ చేసిన నగలు ఆన్​ లైన్​ లో  దొరుకుతున్నాయి. వీటితో పాటు ఫింగర్ రింగ్స్, బ్రేస్​ లెట్స్, ఇయర్ రింగ్స్, మంగళ సూత్రాలు ఇలా అన్ని నగలకు ఆల్ఫాబెటికల్ అందాలు అద్దుతున్నారు. చాలామంది అబ్బాయిలు కూడా బ్రేస్​ లెట్స్, ఫింగర్ రింగ్స్ డిజైన్ చేయించుకుంటున్నారు.. ఆన్​ లైన్​ లో  కస్టమైజ్డ్ జ్యువెలరీ అని సెర్చ్ చేయగానే ఇవి అందుబాటులో ఉండే వెబ్ సైట్స్ వచ్చేస్తున్నాయి. వాటిలో డిజైన్ సెలెక్ట్ చేసుకుని నేమ్ సెండ్ చేస్తే చాలు చెప్పిన టైంకి డెలివరీ అయిపోతుంది. అంతేకాదు ఈ జువెలరీ కలర్ కొంచెం కూడా షేడ్ కాదు. ఎందుకంటే వీటిని 18 క్యారెట్ గోల్డ్ తయారు చేస్తున్నారు. ఇవి 1500 రూపా యల నుంచి అందుబాటులో ఉంటున్నాయి.


–వెలుగు, లైఫ్​–