కామారెడ్డి, వెలుగు: చట్టాలపై మహిళలు అవగాహన పెంచుకొని, చైతన్యం కావాలని హైకోర్టు జడ్జి జె.శ్రీనివాస్‌రావు పిలుపునిచ్చారు. న్యాయ సేవా సాధికారిత సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డిలోని కళాభారతిలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. రాజ్యాంగంలో పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించారన్నారు. మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని సూచించారు.
న్యాయ సేవా సాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి వీఆర్ఆర్ వరప్రసాద్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ సింధూశర్మ, డిస్టిక్ సెక్షన్జడ్జి లాల్‌సింగ్ శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి, ఫస్ట్ క్లాస్ మెజిస్ర్టేట్ దీక్ష, బార్అసోసియేషన్ ప్రెసిడెంట్శ్రీకాంత్గౌడ్, అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు.