Women Beauty : టమాటాలతో మీరు అందంగా.. మిలామిలా మెరిసిపోతారు.. !

సాధారణంగా చాలా కూరల్లో టమాటాలు వేస్తుంటాం. కానీ, ప్రత్యేకంగా టొమాటో కూర వండడం చాలా అరుదు. టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టొమా టాల్లో లికోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అందుకే ఎండాకాలంలో తినే ఆహారంలో టమాటాలు ఎక్కువగాచేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇది శరీరానికి సన్ స్క్రీన్ప్లే పనిచేస్తుంది. అంతేకాదు టమాటా గుజ్జును చర్మానికి అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది.

ALSO READ | Good News : ఇలా చేస్తే.. మీరు రోజూ సంతోషంగా ఉంటారు.. ఒక్కసారి చేసి చూడండి..!

 మొటిమలు, మచ్చలకు ఇది మంచి ఔషధంలా పని చేస్తుంది. టమాటా గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మొటిమలు మాయం అవుతాయి. టమాటాలో ఉండే విటమిన్-ఎ, విటమిన్-సి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి. రెట్టింపు అందాన్ని ఇస్తాయి. టమాటాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ సెల్యులార్ డ్యామేజ్ అవకుండా కాపాడుతాయి. అంతేకాకుండా చిన్న వయస్సులో ఏర్పడే వృద్ధాప్య ఛాయలను నివారిస్తాయి. అందుకే వేసవిలో టమాటాలు ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. టామాటా జ్యూస్లు తీసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది