గుర్రాల సరోజనమ్మకు ఉమెన్ అఛీవర్స్ అవార్డు

బోధన్, వెలుగు: బోధన్​కు చెందిన గుర్రాల సరోజనమ్మకు రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్​అచీవర్స్​తో సత్కరించింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆమె గురువారం అవార్డుతో పాటు రూ.లక్ష నగదు అందుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగ విరమణ పొందిన సరోజనమ్మ రూ.2 కోట్లు విలువైన తన ఇంటిని రిటైర్డ్​టీచర్స్ అసోసియేషన్​కు విరాళంగా ఇచ్చారు. 

ప్రస్తుతం ఆమె తెలంగాణ ఆల్​పెన్షనర్స్​అసోసియేషన్​బోధన్​డివిజన్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అనాథ శవాల అంత్యక్రియల కోసం ధర్మస్థలి నిర్మాణం, పేద పిల్లలకు స్కూల్​ఫీజులు కట్టడం, వైద్య సహాయం అందించడం లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పెన్షనర్స్​యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె. రామ్మోహన్​రావ్​సరోజనమ్మకు కృతజ్ఞతలు తెలిపారు.