ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఒక ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం చేసినందుకో, దోపిడికి పాల్పడినందుకో కాదు.. ఇంటి యజమాని కుటుంబం ఆరోగ్యాన్ని రిస్క్లో పడేసినందుకు ఆ ఇంటి పని మనిషి రీనాను పోలీసులు అరెస్ట్ చేశారు.
#WATCH | Uttar Pradesh: A woman, identified by Police as Reena, arrested by Crossings Republic PS team for allegedly mixing urine to make flour dough at a flat in a residential society in Ghaziabad.
— ANI (@ANI) October 16, 2024
(Video: Ghaziabad Police) pic.twitter.com/I0gXGfFcRv
ఇంతకీ ఆమె చేసిన నీచమైన పనేంటంటే.. వంటగదిలో పనిచేస్తూ ఒక పాత్రలో మూత్రం పోసింది. ఆ మూత్రాన్ని రోటీల పిండిలో కలిపి యజమానితో సహా ఇంటిల్లిపాదికీ ఆ రోటీలను వడ్డించింది. అసలు ఈ విషయం ఎలా బయటికొచ్చిందంటే.. ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులను గత కొన్ని నెలలుగా లివర్ సంబంధిత సమస్యలు ఇబ్బందిపెడుతున్నాయి. హాస్పిటల్స్కు వెళ్లి తగిన మెడికేషన్ తీసుకుంటున్నప్పటికీ అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.
ALSO READ | దెయ్యాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయ్.. నిమ్మకాయ కోసి పూజ చేస్త: బీజేపీ ఎంపీ
దీంతో ఆ ఇంటి యజమానికి ఎందుకో ఇంటి పని, వంట పని చేస్తున్న మహిళపై అనుమానమొచ్చింది. తమకు వండే ఫుడ్ ఎలా తయారుచేస్తుందో తెలుసుకుందామని ఆమెకు తెలియకుండా సీక్రెట్గా కిచెన్లో మొబైల్ ఫోన్ అమర్చి వీడియో రికార్డింగ్ మోడ్ ఆన్ చేశాడు. అప్పుడు ఈ పనిమనిషి చేస్తున్న నీచమైన పని బయటపడింది. వంట గదిలో పనిచేస్తూ ఒక బౌల్ తీసుకుని అందులో మూత్రం పోసింది. ఆ మూత్రాన్ని రోటీలకు కలిపే పిండిలో పోసి రోటీలు చేసింది. ఈ వీడియో చూసిన ఆ ఇంటి యజమానికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది. పోలీసులకు విషయం చెప్పడంతో ఆ పని మనిషిని పోలీసులు అరెస్ట్ చేశారు.
? In #Ghaziabad, cook #Reena was caught urinating in kitchen utensils. She made rotis in a urinated vessel and fed rotis to the entire family, because of which they used to remain ill.
— Political Quest (@PoliticalQuestX) October 16, 2024
She was arrested by Police today, and was working with the family for the past 8 years. pic.twitter.com/qA5coouBGL
ఎందుకిలా చేశావని ఆ పని మనిషిని విచారణలో పోలీసులు అడగ్గా.. చిన్నచిన్న పొరపాట్లకు కూడా ఆ ఇంటి యజమాని తనను పలుమార్లు దారుణంగా తిట్టాడని ఆమె చెప్పింది. అందుకే.. ఇలా చేసినట్లు విచారణలో చెప్పుకొచ్చింది. ఇంటి యజమానిపై కోపంతో ఇలాంటి పని చేయడం ఏంటని నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. అంత ఇబ్బందిగా ఉంటే అక్కడ పని మానేసి మరొక చోట చూసుకోవాలి తప్ప ఇలా మూత్రం కలిపి వంటలు చేసి కుటుంబాన్ని అనారోగ్యం బారిన పడేయడం ఏంటని మండిపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.