న్యూస్ పేపర్ల చీర.. అసలు కట్టుకున్నట్టే ఉండదు.. అంత తేలిక

పిచ్చి పది రకాలు అయితే ఇది పదకొండో రకం అనుకునేరు. కాదు, కాదు. దీన్నే క్రియేటివిటి ఉంటారు. తోచింది చేయడం.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఇదిగో ఇలా అందరి ముందుకు రావడం. తాజాగా క్రాఫ్ట్ క్రియేషన్స్‌కు పేరుగాంచిన పార్వతి అనే మహిళ వార్తాపత్రికలతో చీరను తయారు చేసింది. అంతటితో ఊరుకుందా..! లేదు. ఆ చీరను తన ఒంటికి చుట్టి వయ్యారాలు ఒలకబోసింది. అది నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం 4 గంటల్లోనే ఆమె ఈ చీరను తయారు చేయడం గమనార్హం.

ALSO READ : Viral Video: పప్పీలతో ఈ పిచ్చివేషాలు ఏంటీ..ఈ స్టంట్స్ ఏంట్రా

సృజనాత్మకతను అన్వేషించడంలో ఎల్లప్పుడూ ముందుండే క్రాఫ్ట్ క్రియేషన్స్‌ పార్వతి వార్తాపత్రికలతో అందమైన చీరను తయారు చేసింది. అందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. వీడియోలో, ఆమె తాను సిద్ధం చేసిన చీరను ప్రదర్శించడమే కాకుండా, దానిని ఎలా తయారు చేసిందో కూడా ప్రజలకు వివరించింది. అనంతరం చీర ఎంత సౌకర్యవంతంగా ఉందో, ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో ప్రజలకు చూపించింది. ఇప్పటివరకు ఈ వీడియో 2.6 మిలియన్ల వీక్షణలను ఆకర్షించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Art Beats (@artbeats_diary)

ఆమె ఆలోచనను, నాలుగు గంటల్లో చీరను తయారు చేసిన ఆమె సృజనాత్మకతను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. 'సరికొత్త చీర.. ధర తక్కువ.. తేలికైనది..' అంటూ సినిమా డైలాగులు పేలుస్తున్నారు. ఇదే అదునుగా  ఓ నెటిజెన్ "అసలే ఒంటిపై బట్టలు బరువై చిన్న చిన్న గుడ్డ ముక్కలు ధరిస్తున్న రోజులివి.. ఇలాంటి ఈ కాలంలో న్యూస్ పేపర్ చీరలు పరిష్కారాన్ని చూపాయి.." అని వ్యగ్యంగా కామెంట్ చేశాడు. మొత్తానికి ఈ న్యూస్ పేపర్ల చీర ఇళ్ల కొత్త ఆలోచనలకు మార్గం చూపుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఇళ్ల దగ్గర ఖాళీగా ఉన్న వనితలు మీరు మొదలు పెట్టండి.